Political News

టీడీపీ అధికారంలోకి వస్తే హోం మంత్రులు ఎంతమందంటే..

రాజకీయాలు చాలా చిత్రమైనవి.. రాజకీయ నాయకులు మరింత చిత్రమైనవారు.. అందులోనూ సీనియర్ నాయకుల చిత్రాలు మరింత విచిత్రంగా ఉంటాయి. అలా అని అవేమీ చిన్నచిన్న విషయాలు కావు.. ఎంతో ముందుచూపుతో వేసే పెద్దపెద్ద అంగలు. అవును.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలూ ఇలాంటి అంగలే వేస్తూ తమ అధినేత చంద్రబాబు జేబులో తమ కోర్కెల చిట్టా పెడుతున్నారు. అయితే.. నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి మాటవసరుసగానో, మనవిగానో కాకుండా… వినతిపత్రంగానో, డిమాండుగానో అసలే కాకుండా వెరైటీగా వైసీపీపై ఆగ్రహం చూపిస్తూ పనిలోపనిగా తమ మనసులో కోరికను చంద్రబాబు ముందుంచుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు జరగ్గా తాజాగా టీడీపీ ఫైర్ ఇంజిన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఆ ప్రయత్నం చేశారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడంతో దాన్ని సొమ్ము చేసుకుంటూ టీడీపీ వేగంగా పికప్ అవుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీలోని చాలామంది సీనియర్లు వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమనే అంచనాకు వస్తున్నారు. దాంతో వారు కూడా యాక్టివ్ అవుతూ తమ ప్రభుత్వం ఏర్పడితే తమకేంటి అనేది కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే టీడీపీ కేబినెట్లో ఏ పదవి తీసుకుంటే మంచిదనే అంచనాలు వేసుకుంటూ ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. మరో 9 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని … తమ పార్టీ అధికారంలోకి రాగానే తాను హోం మంత్రినవుతానని.. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని… ప్రభుత్వం ఎవరిపై కేసు పెట్టమంటే పోలీసులు వారిపై కేసు పెడుతున్నారని అయ్యన్న ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో హోం మంత్రిగా తాను ఏపీలో లా అండ్ ఆర్డర్ రక్షిస్తానని అన్నారు.

అయితే.. గతంలో టీడీపీకే చెందిన అచ్నెన్నాయుడు కూడా తాను హోం మంత్రి అయి మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులను హెచ్చరించారు. ఏపీలో సర్పంచి ఎన్నికల సమయంలో అచ్చెన్న సొంతూరిలో అభ్యర్థిని ఆయన బెదిరించారని పోలీసులు అరెస్ట్ చేయడంతో వారిపై ఆగ్రహించిన సందర్భంలో అచ్చెన్నాయుడు అలా అన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు సీఎం అయిన వెంటనే తాను హోం మంత్రి అవుతానని, తనపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు అప్పట్లో అన్నారు.

ఆ తరువాత కూడా అనుచరుల వద్ద అచ్చెన్న అనేకసార్లు హోం మంత్రిని అవుతానని అన్నట్లు చెప్తుంటాయి టీడీపీ వర్గాలు. రాయలసీమకు చెందిన ఒకరిద్దరు నాయకులు కూడా టీడీపీలో హోం మంత్రి పదవిపై ఆశపెట్టుకున్నట్లు సమాచారం. మొత్తానికి టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే హోం మంత్రి పదవికి ఫుల్ గిరాకీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అధికారంలోకి రాకముందే ఆ పార్టీ నుంచి హోం మంత్రుల లిస్టు పెద్దదైపోతోంది. అయితే… పదవుల పంపకం కంటే ముందు ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్లాన్ చేసి కష్టపడడం మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

This post was last modified on January 19, 2023 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

4 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

5 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

6 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

9 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

9 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

9 hours ago