Political News

తోట వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌.. కొత్త స‌వాల్‌!

తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేత‌, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర‌శేఖ‌ర్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ర‌ఘునంద‌న‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. 40 ఎక‌రాల భూమిని అప్ప‌నంగా 4 వేల కోట్ల‌కుకొట్టేశార‌ని.. ర‌ఘునంద‌న‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఖ‌మ్మంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ స‌భ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నార‌ని కూడా ఆరోపించారు.

అయితే.. ర‌ఘునంద‌న‌రావు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై తోట రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేతలు తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాదులో తనకు ఒక్క ఎకరా ఇచ్చినట్లు వారు నిరూపిస్తే 10 శాతం త‌ను తీసుకుని మిగిలిన 90 శాతం ఆరోప‌ణ‌లు చేసిన వారికే ఇచ్చేస్తాన‌ని అన్నారు. కేవ‌లం బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన ఇమేజ్‌ను దెబ్బ‌తీసేందుకు మాత్ర‌మే ర‌ఘునంద‌న‌రావు ఇలా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు.

సంచలనాల కోసం బీజేపీ నేతలు పనికిమాలిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుల ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. తెలంగాణలో ఏ రకమైన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయో వాటిని ఏపీ ప్రజలకు అందేలా కృషి చేస్తామ‌ని తెలిపారు.

ఏపీలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతోందని తోట అన్నారు. త్వరలోనే విశాఖలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నేటి సభకు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తున్నామని, సభను విజయవంతం చేస్తున్నామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాగా, ఏపీ నుంచి 2 వేల బ‌స్సుల‌ను తోట ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి గాను ఆయ‌న దాదాపు కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

This post was last modified on January 18, 2023 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago