ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా ఖమ్మంలో నిర్వహించటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు గడిచిన కొద్దిరోజులుగా భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 70 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు వచ్చే వారు కూర్చోవటానికే 70 వేల కుర్చీలను వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఇంత భారీగా ఒక రాజకీయ సభను ఏర్పాటుచేసింది లేదంటున్నారు. ఈ భారీ సభకు ముగ్గురు ముఖ్యమంత్రుల్ని.. ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు.. పలువురు జాతీయ పార్టీ నేతల్ని ఆహ్వానించటం ద్వారా.. తనకున్న సత్తాను చాటాలన్నది కేసీఆర్ ప్రయత్నంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సభకు జనాల్ని తరలించేందుకు ఏపీ నుంచి బస్సుల్ని బుక్ చేసినట్లుగా చెబుతున్నారు.
తమ ప్రత్యర్థి పార్టీలు నిర్వహించే రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సుల్ని కేటాయించే విషయంలో ప్రభుత్వాలు ఎంత కటువుగా ఉంటాయో తెలిసిందే. అందుకు భిన్నంగా.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సభకు ఏపీకి చెందిన బస్సుల్ని కేటాయించటం ద్వారా.. కేసీఆర్ మీద తనకున్న అభిమానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాటుకున్నారన్న ప్రచారం సాగుతోంది.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రిగా వ్యవహరించిన జవహర్ ఈ వ్యవహారంపై స్పందించారు. బీఆర్ఎస్ సభకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున బస్సులు పంపుతున్నారని.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభకు ఏపీ బస్సులు కేటాయించటం దేనికి నిదర్శనం? అంటూ ప్రశ్నిస్తున్నారు.
జగన్ కు కేసీఆర్ కు మధ్యనున్న ఇచ్చిపుచ్చుకునే వైనం కొత్తేం కాదని ఆయన మండిపడ్డారు. 2019 లో జరిగిన ఎన్నికల వేళలో తనకు కేసీఆర్ అందించిన సహకారానికి నిదర్శనంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రిటర్న్ గిప్టు రూపంలో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. ఖమ్మం సభతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…