Political News

కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి దూరమైనట్లేనా ?

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. వీర్రాజు ఎవరినీ కలుపుకుపోవడం లేదని, ఆయనతో ఉన్న నలుగురైదుగురు నేతలను మాత్రమే సంప్రదిస్తున్నారని కన్నా చాలా రోజులుగా ఆగ్రహం చెందుతున్నారు. పైగా కన్నా నియమించిన జిల్లా అధ్యక్షుల్లో 8 మందిని సోము వీర్రాజు మార్చేశారు. వీర్రాజు వర్గం ప్లాన్ ప్రకారం పార్టీని హైజాక్ చేస్తున్నారని కన్నా వర్గం బహిరంగ ఆరోపణలకు దిగింది. తొలుత వీర్రాజు వర్గం సమాధానం చెప్పలేదు తర్వాతి కాలంలో పుండు మీద కారం చల్లినట్లుగా ఎదురుదాడి ప్రారంభించింది.

కార్యవర్గ భేటీకి దూరం

ఢిల్లీ నుంచి పార్టీ ఇంఛార్జ్ శివప్రకాష్ ఫోన్ చేసి బుజ్జగించినా కన్నా బెట్టు వీడలేదు. జగన్‌ బీఆర్‌ఎస్ తో దోస్తీ చేస్తున్నారని, అక్కడ బండి సంజయ్ ను, ఇక్కడ కాపులను టార్గెట్ చేస్తున్నారని, తద్వారా పవన్‌ కళ్యాణ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే తామంతా పవన్‌ కు అండగా ఉంటామని కన్నా నేరుగా శివప్రకాష్ తోనే చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రావాల్సిందిగా కన్నాకు ఆహ్వానం అందింది. తనను మాత్రమే పిలిచారని భావించిన వీర్రాజుకు ఇదో పెద్ద షాక్ గా పరిణమించిందనే చెప్పాలి..కన్నాకు ఇన్విటేషన్ ఎలా వచ్చిందని ఆరా తీయడం మొదలు పెట్టారు.

తిరుమల వెళ్లిన కన్నా

కన్నా లక్ష్మీ నారాయణ ఢిల్లీ వెళ్లలేదు. ముందే తిరుమల ప్రయాణం పెట్టుకున్నానని అందుకే కార్యవర్గ సమావేశానికి రాలేకపోతున్నానని హస్తిన పెద్దలకు లేఖ పంపారు. కుటుంబ సభ్యులతో వెళ్లాలని నిర్ణయించుకున్నందున ఈ సారికి రాలేనని ప్రకటించారు. దానితో ఇప్పుడు కన్నా తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన బీజేపీని వదిలి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు జనసేనలో చేరాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు..

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

1 hour ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

9 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

10 hours ago