Political News

తెలంగాణ : ఆ సీనియర్ లీడర్ మళ్లీ టీడీపీలోకి !

నేషనల్ పాలిటిక్స్‌పై నజర్ పెట్టిన బీఆర్ఎస్‌కు సొంత రాష్ట్రం తెలంగాణలోని జిల్లాజిల్లాలో తలనొప్పులు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోనూ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయి.

ప్రధానంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు గొంతు విప్పుతూ తన ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచారు. ఆ విమర్శలు కేవలం తన స్థానిక ప్రత్యర్థులకే కాకుండా పార్టీలో పెద్దలను కూడా తాకేలా సూటిగా ఉండడం చర్చనీయమవుతోంది.

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి అక్కడ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎవరికీ తలవంచి పాదాభివందనం చేయలేదని అన్నారు. తప్పు చేయను, తల వంచను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయమవుతున్నాయి. ఆర్జించడం కాదు, ఆత్మగౌరవంతో బతకండి అంటూ ఆయన అన్న మాటలు పార్టీలో వేడినిపెంచుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవితను, పార్టీ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ మాటలు అన్నారంటూ ఆయన వ్యతిరేకులు చెప్తున్నారు.

కేసీఆర్ రీసెంటుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించారు. ఆ సమయంలో మాలోత్ కవిత.. కేసీఆర్ కాళ్లకు మొక్కారు. దీనిపై బీజేపీ నేతలు అప్పుడే విపరీతంగా ట్రోల్ చేశారు. ఒక గిరిజన మహిళతో కాళ్లు మొక్కించుకున్నారంటూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తాజాగా కడియం శ్రీహరి కూడా అన్యాపదేశంగా ఈ విషయమే ప్రస్తావించారు. ఆయన కవితతో పాటు కేసీఆర్‌నూ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీలో ఉండలేక కడియం బీఆర్ఎస్‌లో చేరారు. కొంతకాలం కేసీఆర్ మంత్రివర్గంలోనూ ఉన్నా ఆ తరువాత ఆయన స్థానం పోయింది. ఇప్పుడు టికెట్ కూడా ఆయనకు ఇవ్వరన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్‌పై కోపంగా ఉన్నారని… అదేసమయంలో టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివేట్ అవుతుండడంతో అటువైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ముఖ్యులు కొందరు ఆయనతో టచ్‌లోకి వెళ్లారని.. పాత వరంగల్ జిల్లాలో టీడీపీకి పునర్వైభవం తేవాలని, అందుకు తమతో కలిసిరావాలని కడియంను టీడీపీ కీలక నేత ఒకరు సంప్రదించినట్లు వినిపిస్తోంది.

ఎలాగూ టికెట్ ఇవ్వాలనుకోవడం లేదు కాబట్టి కడియం బయటకు వెళ్లినా ఇబ్బందేం లేదంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నా… కడియం వంటి సీనియర్లు బయటకు వెళ్లడం అలాంటి మరికొందరికి దారి చూపినట్లు అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

This post was last modified on January 16, 2023 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

3 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

4 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

4 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

5 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

6 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

6 hours ago