Political News

‘అఖిల’ ప్రియ… కాదు.. ‘అప్పుల’ ప్రియ‌…!


టీడీపీ నాయ‌కురాలు.. మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్‌ భూమా అఖిల ప్రియ‌.. కొన్నాళ్లుగా రాజ‌కీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఆమెను పార్టీలో ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం.. క‌నీసం.. కుటుంబంలోనూ ద‌న్నుగా ఎవ‌రూ నిల‌బ‌డ‌క‌పోవ‌డం .. వంటివి ఆమెను చిరాకు పెడుతున్నాయి. అయితే.. ఇంత‌లో, అఖిల ప్రియ‌కు.. అప్పులు మ‌రింత సంక‌టంగా మారాయి.

‘అఖిల’ ప్రియ కాదు.. ‘అప్పుల’ ప్రియ అంటూ.. సొంత కుటుంబ స‌భ్యులు.. స్థానిక మీడియా ముందు కామెంట్లు చేస్తున్నారు. అఖిల ప్రియ తండ్రి, త‌ల్లి తాలూకు బంధువులు.. త‌మ‌కు అప్పుగా ఉన్న కోట్ల రూపాయ‌ల సొమ్మును త‌క్ష‌ణ‌మే ఇచ్చి వేయాల‌ని.. డిమాండ్ చేస్తూ.. ఏకంగా రోడ్డెక్కారు. వాస్త‌వానికి గ‌త ఏడాది నుంచి కూడా ఈ అప్పుల వివాదం న‌డుస్తోంది. వారు అడుగుతూనే ఉన్నారు.

అయితే.. అధికారం లేదు.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఇస్తాన‌ని.. కొన్నిసార్లు, అసలు ఇప్పుడు ఇవ్వ‌లేను. నేనే ఇబ్బందుల్లో ఉన్నాన‌ని మ‌రో సారి.. ఇలా చెప్ప‌డంతోపాటు.. ప్ర‌స్తుతం ప‌రిస్థితి బాగోలేదు ఇంటికి ఎవ‌రూ రావొద్దు.. అని తేల్చి చెప్ప‌డంతో బంధువులు రోడ్డెక్కారు. త‌మ సొమ్ము త‌మ‌కు ఇవ్వాల‌ని కోరుతూ .. స్థానిక మీడియాను కూడా ఆశ్ర‌యించారు. దీంతో అఖిల ప్రియ చుట్టూ మ‌రో వివాదం ముసురుకున్న‌ట్టు అయింది.

అప్పుల విష‌యానికి వ‌స్తే..

  • భూమా నాగిరెడ్డి అన్న భాస్క‌ర్‌రెడ్డి కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి రూ.11 కోట్లు ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.
  • భూమా నాగిరెడ్డి పెద్ద‌న్న ప్ర‌తాప్‌రెడ్డి కుమార్తె రాజేశ్వ‌రి రూ.2 కోట్లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.
  • ఇత‌ర బంధువ‌ర్గం.. నుంచి రూ.5 కోట్ల వ‌ర‌కు అప్పు ఉంద‌ని చెబుతున్నారు.
  • వీటికితోడు స్థానిక బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తం కూడా రూ.కోట్ల‌లోనే ఉంది.

This post was last modified on January 15, 2023 8:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

2 hours ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

3 hours ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

3 hours ago

డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…

4 hours ago

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

4 hours ago