సీఎం జగన్ లెక్కలో మరో 16 మాసాల్లోఏపీలో ఎన్నికలు రానున్నాయి. మరి.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ది చేసినా.. చేయకపోయినా.. గత ఎన్నికల్లో ఇచ్చిన పోలవరం హామీని మాత్రం నెరవేర్చాల్సిన అవసరం కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే.. తన తండ్రి వైఎస్ కలలు కన్న.. పోలవరాన్ని పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడడం లేదు.
దీనికి కారణం.. నిధుల కొరత.. వ్యూహ లేమి! విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తిగా కేంద్రమే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు అని గతంలో అసెంబ్లీలో జగన్ గొంతు సారించి మరీ చెప్పారు. అయితే.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పోనీ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులనైనా రాబట్టుకుంటున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు.
గత రెండేళ్లుగా కేంద్రం పోలవరం నిధులకు సంబంధించి ఏవిషయాన్నీ తేల్చడం లేదు. రాజకీయంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేసి సాధించాలే తప్ప ఇందులో తాము చేయగలిగేదేమీ లేదని కొందరు జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకుని ప్రధానిని ఇప్పటి వరకు 11 సార్లు కలుసుకున్నారు. ఇలా వెళ్లిన ప్రతి సందర్భంలోనూ పోలవరం నిధులు అడిగారని, అడుగుతున్నారని.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
సవరించిన అంచనాల ప్రకారం 57 వేల కోట్లకు కేంద్రం అంగీకరించేలా ప్రయత్నాలు చేస్తున్నామని.. చెబుతూనే ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రం తన పంతానికి కట్టుబడి ఉంది. దీనిని ఎదిరించి.. నిధులు సమీకరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది. మరోవైపు ఎన్నికలు దూసుకువస్తున్నాయి. ఇప్పటి వరకు పునరావాసం లేకుండా పోయింది.
కనీసం.. ఇక్కడి వారిని పట్టించుకోవడం లేదని.. అన్ని రాజకీయ పక్షాలు హేళన చేస్తున్నాయి. అయినా.. సీఎం జగన్ పట్టించుకోవడం లేదు. కట్ చేస్తే.. ఇదంతా ఉన్నదే కదా.. ఇప్పుడు ఎందుకు? అంటారా? ఈ నెల 20న ఏపీ జలవనరుల శాఖతో కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల భేటీ ఉంది. కనీసం అప్పుడైనా.. పోలవరం నిధుల విషయాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించేలా.. కనీసం సవరణ బడ్జెట్‌లో అయినా(ముందు బడ్జెట్ ప్రకటించినా.. తర్వాత మళ్లీ మార్చేవెసులుబాటు ఉంది) పోలవరం నిధులు రాబట్టాలనేది నిపుణుల మాట. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on January 15, 2023 10:53 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…