Political News

అమ‌రావ‌తి సెంటిమెంటు ఏమైన‌ట్టు…

రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క‌మైన సెంటిమెంటుగా ఉన్న రాజ‌ధాని అమ‌రావతి విష‌యం ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ స‌హా.. జ‌న‌సేన‌లో ఈ విష‌యం ఆస‌క్తిగా ఉంది. రాజ‌ధాని అమ‌రావ‌తికే త‌మ మ‌ద్ద‌తు అని టీడీపీ బాహాటంగానే ప్ర‌చారం చేసింది. అయితే.. త‌ర్వాత చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డి ప్ర‌జ‌ల నాడిని తెలుసుకున్నారు.

పైకి మౌనంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఉత్త‌రాంధ్ర‌, సీమ ప్రాంతాల్లో వ‌రుసగా చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తెప్పించుకున్న స‌ర్వేల నివేదిక‌ల ఆధారంగా ఏమైందో ఏమో.. అమ‌రావ‌తి గురించిన ప్ర‌స్తావ‌న‌ను త‌గ్గించేసి.. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పైనే దృష్టి పెట్టారు. సీఎం జ‌గ‌న్‌ను కార్న‌ర్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఇప్పుడు చిత్రంగా అదే అమ‌రావ‌తి ఇష్యూపై వైసీపీలో చ‌ర్చ‌సాగుతోంది.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం హైకోర్టు అమ‌రావ‌తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆరుమాసాల్లో ఇక్క‌డ అభివృద్ది చేయాల‌ని తేల్చి చెప్పింది. దీనిని సుప్రీంకోర్టులో స‌వాల్ చేసినా.. స‌మ‌యాన్ని త‌ప్పు బ‌ట్టిందే త‌ప్ప‌.. రాజ‌ధానిని త‌ప్పు బ‌ట్ట‌లేదు. పైగా.. అమ‌రావ‌తికి అనుకూలంగా ఉన్న‌ట్టుగా సంకేతాలు పంపించింది. రైతుల సెంటిమెంటును తీవ్రంగా భావించింది. ఈ నెల‌లో మ‌రోసారి సుప్రీంకోర్టు ఈ విష‌యాన్ని విచారించ‌నుంది.

ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు అమ‌రావ‌తికి అనుకూలంగా ఏదైనా తీర్పు ఇస్తే ఏం చేయాల‌నేది వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీస్తోంది. రాజ‌కీయ ప‌క్షాలు ఏమ‌నుకుంటున్నాయ‌ని ఆరాతీస్తే.. దాదాపు అవి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, రాజ‌ధాని రైతులుకూడా సుప్రీం కోర్టు తీర్పు కోసం..చూస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌భుత్వ ప‌రంగా ఏం చేయాలి..? ఎన్నిక‌ల‌కు ముందు అమ‌రావ‌తి అజెండాను అందుకుంటే.. న‌ష్ట‌మ‌ని.. కాబ‌ట్టి దీనికి విరుగుడుగా ఎలా ముందుకుసాగాల‌నేది ఆస‌క్తిగా మారింద‌ని అంటున్నారు.

This post was last modified on January 15, 2023 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago