అంచనాలు నిజమవుతున్నాయి. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచానికి పెను ప్రమాదకరంగా మారిన కోవిడ్ 19కు చెక్ చెప్పేందుకు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచం ఒకే సమయంలో ఒకేలాంటి సమస్య మీద యుద్ధం చేసిన మొదటిసారిగా చెప్పాలి. ఈ మహమ్మారికి చెక్ చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర 120కు పైగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతున్నాయి. ఇంత భారీగా సాగుతున్నా.. ఆరు వ్యాక్సిన్ ప్రయోగాల మీదనే ప్రపంచం చాలా ఆశలుపెట్టుకుంది. అందునా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ.. ఆస్త్రా జెనెకా ఫార్మా కంపెనీ కలిసి తయారు చేస్తున్న వ్యాక్సిన్ మీదనే బోలెడన్ని అంచనాలు ఉన్నాయి.
అందరి ఆశల్నినిజం చేస్తూ.. తాజాగా ఆక్స్ ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ సక్సెస్ ఫుల్ అయినట్లుగా ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పేర్కొంది. ఒక వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఐదారేళ్ల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ సమయం తీసుకునే పరిస్థితి. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో గతంలో మరెప్పుడు జరగనంత పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.
దీనికి సంబంధించి ప్రయోగాలు పలు దశల్లో ఉన్నాయి. పలు వ్యాక్సిన్లు హ్యుమన్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఆక్స్ ఫర్ట్ ఇటీవల నిర్వహించిన హ్యుమన్ ట్రయల్స్ విజయవంతమైనట్లు పేర్కొంది. వారు డెవలప్ చేసిన ChAdOx1 nCoV-19 తో అద్భుత ఫలితాలు వస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నట్లు వెల్లడించింది.
వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు యాంటీ బాడీలు తయారు కావటమే కాదు.. కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేంత రోగనిరోధక శక్తిని సంపాదించినట్లుగా చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవన్న వారు.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తలనొప్పి.. జ్వరం లాంటి లక్షణాలు కనిపించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ వ్యాక్సిన్ ఎంతకాలం పని చేస్తుందన్న విషయంపై రానున్న రోజుల్లో చేసే ప్రయోగాల్లో స్పష్టమవుతుందని చెబుతున్నారు. దారంతా చీకటిగా మారిన వేళ.. చిన్న వెలుగు సైతం కొత్త ఆశల్ని చిగురించేలా చేస్తాయి. ప్రస్తుత పరిస్థితి ఇంచుమించు అలాంటిదే.
This post was last modified on July 20, 2020 10:30 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…