శ్రీకాకుళంలో నిర్వహించిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుమ్మురేపారు. వైసీపీ నేతలపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాను హైదరాబాద్‌లో కలిసినప్పుడు వైసీపీ వెధవలు అందరూ ఏం మాట్లాడుకున్నారంటూ.. ప్రశ్నించారని.. ఈ వెధవలకు తెలియదు.. నేను చాలా విషయాలే చర్చించానని.. పవన్ వ్యాఖ్యానించారు.
“అరేయ్ వెధవల్లారా నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదురా.. 20 కోట్లు టాక్స్ కట్టే సత్తా ఉన్న వాడిని. ప్యాకేజీ కాదు.. మీ వోల్టేజీ తీసేసే వాడిని. వైజాగ్‌లో నా పార్టీ నేతలపైనా.. కార్యకర్తలపై దాడులు జరిగిన సంఘటనకు చంద్రబాబు నాకోసం నిల్చున్నాడు. ఆయనకి కుప్పంలో జరిగిన ఘటనకు సంబంధించి సాలిడారిటీ చూపించడం నా బాధ్యత. అందుకే హైదరాబాద్‌లో స్వయంగా నేనే ఆయన ఇంటికి వెళ్లా” అని పవన్ వ్యాఖ్యానించారు.
“రెండు గంటలు ఏం మాట్లాడుకున్నారు అని తెగవాగారు ఇప్పుడు చెప్తున్నా ఏం మాట్లాడుకున్నాం. కానీ, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సంబరాలు రాంబాబు గురించి 23 నిమిషాల రెండు సెకండ్లు మాట్లాడుకున్నాం. 18 నిమిషాలపాటు మన రాష్ట్రాన్ని 15వ స్థానంలో పెట్టాడు ఏంటి అని మూడుముక్కల ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకున్నాం” అని పవన్ అన్నారు.
“లా అండ్ ఆర్డర్ ఎందుకు చితికిపోయింది ఏం చేయాలి.. అని ఓ 30 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడే కొద్దీ తీసుకొస్తూనే ఉన్నాయి అలా గంటన్నర అయింది. ఓ పదిహేను నిమిషాలు స్నాక్స్ కోసం గడిచాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి అని మాట్లాడుకున్నాం..” అని పవన్ వెల్లడించారు.
This post was last modified on January 13, 2023 12:45 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…