ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం ఆఫ్ఘనిస్థాన్ మాదిరిగా తయారవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలతో జాతి జీవనాడే దహించుకుపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దేశాన్ని వక్రమార్గంలో పెట్టే దుష్టపన్నాగాలు పన్నుతున్నారని.. ఇలాంటి వారి కుటిల తంత్రాలను.. యంత్రాంగాలను కూకటి వేళ్లతో పెకలించేయాలని.. ప్రజలకు పిలుపునిచ్చారు.
మతపిచ్చి, విద్వేషాలతో ప్రజలను విడదీస్తే జాతి జీవనాడే దహించుకుపోయే పరిస్థితి తలెత్తి.. దేశం మరో ఆఫ్ఘనిస్థాన్‌లా మారడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు వెలుగుమార్గం చూపే అద్భుత చైతన్య వీచిక తెలంగాణ నుంచే వీయాలని.. దీనికి ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని కేసీఆర్ ఉద్ఘాటించారు. గిరిజన, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ప్రపంచంలో దేశం ఐదో స్థానంలో ఉందని చెబుతున్న కేంద్రం.. అప్పుల్లో కూడా అదే దారిలో వెళ్తోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏం పాపం చేసిందని.. ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా అడ్డుపడుతున్నా రని మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. “మన కష్టం మనం తింటున్నాం.. మన నీళ్లు మనం తాగుతున్నాం.. మనకు రావాల్సిన రొక్కం ఇయ్యమని కొరుతున్నాం.. అయినా.. కేంద్రంలోని గుడ్డి, చెవిటి ప్రభుత్వం వినిపించుకోటల్లేదు” అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయల వరకు కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంపై తాను ప్రశ్నిస్తే.. ఈడీ ఓడీ అంటూ.. బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు పొందాలంటే.. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ముందుకు సాగాలంటే.. ప్రజలు ఇలాంటి రాజకీయ నేతల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు.
This post was last modified on January 13, 2023 8:46 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…