నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా మూవీ వీరసింహారెడ్డి విడుదలై ప్రభంజనం సృష్టిస్తు న్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు.. పెద్ద ఎత్తున మూవీకి స్వాగతం పలుకుతూ.. బ్యానర్లు కట్టారు.
మరోవైపు.. టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. ఇక, హిందూపురం నియోజకవర్గంలో ఈ జోష్ మరింతగా కనిపిస్తోంది. ధియేటర్ల దగ్గర సంక్రాంతి అప్పుడే వచ్చేసినట్టు కనిపి స్తోంది. యువత పండగ సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలావుంటే.. ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి.
వైసీపీలోకి రాకముందు.. టీడీపీలో ఉన్న వసంత.. బాలయ్యకు కూడా అబిమాని, ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా ఉంది. అయితే.. వైసీపీలోకి వచ్చి.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, ఇటీవల కాలంలో ఆయన వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుండడం తెలిసిందే. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా బాలయ్య సినిమాకు సంబంధించి భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం.. రాజకీయంగా చర్చకు దారితీసింది.
వైసీపీ నాయకులు ఎంతో మంది అభిమానులుగా ఉన్నప్పటికీ.. అందరూ కూడా పార్టీ లైన్‌కు అనుగుణం గా.. దూరంగా ఉన్నారు. బాలయ్య మూవీలను కూడా చాటుమాటుగా చూస్తున్నారు. కానీ, వసంత మాత్రం బహిరంగంగానే కటౌట్లు పెట్టుకోవడం గమనార్హం.దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on January 12, 2023 9:50 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…