తెలంగాణ రాష్ట్రం గురించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి బాగా తెలిసిన వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సోమేవ్ కుమార్ పాత్ర ఎంత కీలకమన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు థింక్ ట్యాంకర్ గా వ్యవహరిస్తూ.. ఆయనకు కుడి భుజంగా ఉండే సోమేశ్ క్యాడర్ కేటాయింపుపై తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అటు సోమేశ్ కు.. ఇటు ముఖ్యమంత్రికి భారీ షాక్ ఇచ్చేలా మారిందని చెప్పకతప్పదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు పంపకాలు జరగటం.. అందులో సీఎస్ సోమేశ్ ను ఏపీకి కేటాయించటం జరిగింది. అయితే.. ఆయన కేటాయింపుల్ని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వటంతోఆయన తెలంగాణ సీఎస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సాగిన సుదీర్ఘ విచారణ సాగింది.
2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించగా.. ఈ రోజు (మంగళవారం) హైకోర్టు తన తీర్పును వెల్లడించింది. హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తుది తీర్పును ఇస్తూ.. క్యాట్ ఉత్తర్వుల్ని కొట్టేస్తూ.. ఆయన్ను తక్షణం ఏపీకి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. అయితే.. మూడు వారాల సమయం ఇవ్వాలని సోమేశ్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనికి హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆశ్రయించాలని సోమేశ్ కుమార్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. హైకోర్టు తీర్పు కాపీ వచ్చినంతనే సోమేశ్ ఏపీకి వెళ్లిపోవాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశాల్ని జారీ చేసింది.
మరి.. సోమేశ్ ఏపీకి వెళతారా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనూ.. సీఎం కేసీఆర్ కు ఆయన ఎంత సన్నిహితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పాలనకు సంబంధించి సోమేశ్ మాటను వేదంలా కేసీఆర్ భావిస్తారని.. అదే సమయంలో కేసీఆర్ మనసుకు తగ్గట్లు నడుచుకునే విషయంలో సోమేశ్ కు సాటి వచ్చే వారెవరూ ఉండరంటారు. పర్ ఫెక్టు కాంబినేషన్ గా అభివర్ణించే కేసీఆర్ – సోమేశ్ బంధం హైకోర్టు తీర్పుతో తెగే అవకాశం లేదంటున్నారు. అన్ని అవకాశాల్ని చూసుకోవటం.. కాదు కూడదనుకుంటే ఆయన తన పదవికి రాజీనామా చేయటం లాంటివి చేసినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. హైకోర్టు తాజా తీర్పు మాత్రం కేసీఆర్ అండ్ కోకు మాత్రం భారీ షాక్ అని మాత్రం చెప్పక తప్పదు.
This post was last modified on January 10, 2023 2:41 pm
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డుకు చాలా విశిష్ఠత ఉంది. ఎన్టీఆర్ హయాంలో తొలిసారి ఆరుగురు సభ్యులతో ఏర్పడిన…
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ఇవాళ రాజమౌళి అతిధిగా నాగార్జున ప్రారంభించారు.…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…