Political News

న‌డిపించేది బాబే… పొలిటిక‌ల్ గుస‌గుస‌..!

ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం దాదాపు వ‌చ్చేసింది. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో వ్యూహాత్మ‌కంగా మార్పులు చేర్పులు జ‌రుగుతున్నాయి. అయితే.. ఈ మార్పుల‌కు, చేర్పుల‌కు, రాజ‌కీయ వ్యూహాల‌కు కూడా చంద్ర‌బాబు నాయ కుడు కానున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే క‌మ్యూనిస్టులు కూడా చంద్ర‌బాబుతో భేటీ అవుతున్నా రు. ఇప్ప‌టికే జ‌న‌సేన‌-టీడీపీ ఒక అవ‌గాహ‌నా ఒప్పందానికి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయం ప‌రుగులు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఒక అల‌జ‌డి వాతావ‌ర‌ణం నుంచి ఏపీ ఒక వ్యూహాత్మ‌క రాజ‌కీయం వైపు అడుగులు వేస్తుండ‌డంతో.. ప్ర‌భుత్వ ప‌క్షానికి స‌హ‌జంగానే ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని చెప్పాలి. నిజానికి ఒంట‌రి పోరుతో గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు.. కూడా ఒంట‌రిగానే పోరుబాట ప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాలు మూకుమ్మ‌డిగా రంగంలోకి దిగుతున్నాయి.

పైగా.. చంద్ర‌బాబు వంటి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త, విజ‌న్ ఉన్న నాయ‌కుడు ఇప్పుడు ఈ కూట‌మి రాజ‌కీయా ల‌కు నేతృత్వం వ‌హించ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు ఎవ‌రికి ఎలాంటి డిమాండ్లు లేవు. కేవ‌లం త‌మ‌ను కూట‌మిలో చేర్చుకుంటే చాలు.. అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. క‌మ్యూనిస్టులు, బీఎస్పీ నాయ‌కులు.. ఇత‌ర పార్టీల వారు కూడా ఈ కూట‌మిలో చేరేందుకు రెడీ అవుతున్నార‌నేది టీడీపీ నేత‌ల మాట‌.

మ‌రోవైపు.. వీరిని ముందుకు న‌డిపించ‌డ‌మే కాకుండా.. వీరికి ఎన్ని సీట్లు కేటాయించాలి. ఏయే సీట్లు ఇవ్వాల‌నేది చంద్ర‌బాబు ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా.. న‌డిపించేది బాబేన‌ని తేలిపోయింది. దీనిలో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌త్యేక అనుమానాలు కూడా అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. మొత్తానికి బాబు ఒక‌ప్పుడు జాతీయ వ్యూహం వేస్తే.. ఇప్పుడు.. రాష్ట్ర వ్యూహం వేస్తున్నార‌న్న మాట‌.

This post was last modified on January 10, 2023 12:10 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago