Political News

చిరంజీవిని టార్గెట్ చేస్తే ఏమొస్తాది రోజా

పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు చేసే మంత్రి రోజా తాజాగా మరో అడుగు ముందుకు వేసి చిరంజీవిపైనా విమర్శలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే చిరంజీవి సోదరుడు నాగబాబు.. రోజాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజా నోరు చెత్త కుప్ప అని నాగబాబు అనడంతో ఆ మాట ఏకంగా ట్విటర్లో ట్రెండ్‌గా కూడా మారింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు రోజా పై ఆగ్రహిస్తున్నారు.

మరోవైపు రోజా గతంలో నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించిన జబర్దస్ నటుడు గెటప్ శ్రీను కూడా రోజాకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. శ్రీను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయన రోజా కామెంట్లను తప్పుపట్టారు. ముఖ్యంగా చిరంజీవికి సేవాభావం లేదని రోజా అనడాన్ని గెటప్ శ్రీను తప్పు పట్టారు.

‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో.. రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సి వస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు రోజా క్షమాపణ చెప్పాలంటూ చిరంజీవి అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల ఆమె దిష్టిబొమ్మలూ దహనం చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌పై ఎన్ని విమర్శలు చేసినా ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉండడంతో అదేమీ ఇబ్బందికరం కాకపోయినా ఇప్పుడు చిరంజీవిని సీన్లోకి లాగడంతో రోజాపై వ్యతిరేకత కనిపిస్తోంది.

వైసీపీ నేతలు కూడా కొందరు రోజా అనవసరంగా చిరంజీవి ప్రస్తావన తెచ్చారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాజకీయంగా కాపులను పూర్తిగా దూరం చేసుకోవాలంటేనే చిరంజీవిని టార్గెట్ చేయాలని… ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యల వల్ల అలాంటి పరిస్థితే వస్తుందని వైసీపీలోని కాపునేతలు కొందరు అన్నట్లు సమాచారం.

This post was last modified on January 8, 2023 9:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

46 minutes ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

1 hour ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

2 hours ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

2 hours ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

5 hours ago