Political News

జ‌గ‌న్.. నీకో రూలూ.. నాకో రూలా.. చంద్ర‌బాబు ఫైర్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వ‌రుస వివాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు.. అడ్డంకులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా కుప్పంలోపి గుడిపల్లిలో చంద్రబాబు పర్యటనకు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఇక్క‌డి టీడీపీ కార్యాల‌యానికికూడా వెళ్ల‌డానికి వీల్లేద‌ని చంద్ర‌బాబు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాబు..బ‌స్టాండు స‌మీపంలో రోడ్డుపై కాసేపు బైఠాయించా రు. అయిన‌ప్ప‌టికీ.. పోలీసులు దారివ్వకపోవడంతో.. చంద్రబాబు తన బస్సు పైకి ఎక్కి ప్రసంగించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు గుడిపల్లికి రాకుండా మూడు మార్గాల్లో అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. ‘‘పోలీసులూ.. ఏంటీ బానిసత్వం. మీరు బానిసలుగా బతకొద్దు. చట్ట ప్రకారం మీ విధులు నిర్వర్తించండి. ఇక్కడినుంచి నన్ను తిరిగి పంపాలని చూస్తున్నారు.. కానీ నేను వెళ్లను. మిమ్మల్నే ఇక్కడి నుంచి పంపి స్తా. మిమ్మల్నే కాదు.. సైకో సీఎం, ఆయన పార్టీని శాశ్వతంగా భూ స్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతా. నా గొంతు 5 కోట్ల మంది ప్రజలది. ఆ విషయాన్ని జగన్‌ గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వా మ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు“ అని వ్యాఖ్యానించారు.

నేను ప్రశ్నిస్తుంటే పోలీసు అధికారులు పారిపోతారా? సంబంధిత అధికారికి సిగ్గులేదా? చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రజలు తిరగబడితే ఏం చేయగలరు? పోలీసులు ఎక్కడుం టారు.. మీరు ఆకాశంలో తిరగాల్సి ఉంటుంది. ఎన్ని జైళ్లు, పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ప్రజల ను వాటిలో పెట్టగలరు? జీవో నంబర్‌ 1 చట్టవిరుద్ధమైనది. అని చంద్ర‌బాబు అన్నారు.

“రాజమహేంద్రవరంలో సీఎం జగన్‌ మీటింగ్‌ పెట్టలేదా? రోడ్‌షో చేయలేదా? మీ పార్టీ నేతలు రోడ్డు షోలు నిర్వహించలేదా? జగన్‌.. సమాధానం చెప్పు. నీకో రూలు.. నాకో రూలా? పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూస్తే ప్రజలు సహకరిస్తారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారంతా దోషులే’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.

This post was last modified on January 6, 2023 7:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

2 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

4 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

4 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

4 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

6 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

6 hours ago