దేశమంతా కరోనా చర్చల్లో మునిగిపోయి ఉంటే.. రాజస్థాన్‌లో మాత్రం రాజకీయ వేడి రాజుకుంది. అశోక్ గెహ్లాత్ సర్కారుపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం.. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కలిసి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.
సచిన్ వైపు 30 మంది దాకా ఎమ్మెల్యేలున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. ఇటీవల మీడియా ముందు 104 మందితో పరేడ్ నిర్వహించి తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని చాటుకున్నాడు గెహ్లాత్. అనంతరం పైలట్‌ను ఉప ముఖ్యమంత్రిగా తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నాడాయన.
ఆ పరేడ్ తర్వాత గెహ్లాత్‌కు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ శిబిరానికి తరలించిన సంగతి తెలిసిందే. ఓ స్టార్ హోటల్లో వీళ్లందరికీ బస కల్పించి.. సకల వసతులూ కల్పించినట్లు చెబుతున్నారు. ప్రత్యర్థులతో చేతులు కలపకుండా వారిఫోన్ కనెక్షన్లు కూడా కట్ చేశారంటున్నారు. ఐతే ఆ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ నుంచి తాజాగా బయటికి వచ్చిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు బోర్ కొట్టి అంత్యాక్షరి ఆడుకుంటున్న వీడియో అది. సోఫాలపై ఆసీనులైన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాజకీయంగా రాజస్థాన్‌లో అంత ఉత్కంఠభరిత వాతావరణ నెలకొంటే.. ఎమ్మెల్యేలు ఇంత తాపీగా అంత్యాక్షరి పాడుకుంటున్నారేంటా అని జనాలు ఆశ్చర్యపోతున్నారీ వీడియో చూసి.
This post was last modified on July 20, 2020 9:59 am
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…