Political News

దొంగగా మారిన ఏపీ కాంట్రాక్టర్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక తమ పంట పండినట్లే అనుకున్నారు ఆ పార్టీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లు. గతంలో వైఎస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా.. కాంట్రాక్టర్లు మామూలుగా సంపాదించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ, వైఎస్ సన్నిహితులు అప్పట్లో ఎంతో బాగుపడ్డారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ల ముఖాల్లో కళ పోయింది.

పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కించుకున్న బడా బాబులకే ఢోకా లేకపోయింది కానీ.. చిన్న, మీడియం రేంజి కాంట్రాక్టర్ల పరిస్థితే దయనీయంగా మారింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు దక్కించుకుని.. చేతి నుంచి డబ్బులు పెట్టుకుని ఉత్సాహంగా పనులైతే చేసేశారు కానీ.. ఆ తర్వాత బిల్లుల కోసం నెలలు, ఏళ్లు ఎదురు చూస్తూ దయనీయమైన స్థితికి చేరుతున్నారు కాంట్రాక్టర్లు. 2019, 2020ల్లో చేసిన పనులకు కూడా బిల్లులు రాక ఇంకా ఇబ్బంది పడుతున్నవాళ్లున్నారు.

ఇలాగే ఒక కాంట్రాక్టర్ తాను చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు రాక దొంగగా మారిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఒంగోలు జిల్లాకు చెందిన ఆ కాంట్రాక్టర్ పేరు క్రాంతి కిరణ్. ఆర్అండ్‌బీలో కాంట్రాక్టరుగా పని చేసే క్రాంతి కిరణ్.. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కాంట్రాక్టర్ అయ్యాడు. అతను చేసిన రూ.2.70 కోట్ల పనులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర బిల్లులు ఆగిపోయాయి. అవి ఎంతకీ రాకపోవడం అప్పులపాలయ్యాడు. అప్పులవాళ్ల గొడవ ఎక్కువైపోవడంతో ఏం చేయాలో పాలుపోక దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నాడు.

తన మేనత్త ఇంట్లోనే అతను దొంగతనానికి పాల్పడడం గమనార్హం. ఒంగోలులోని దేవుడు చెరువు ప్రాంతంలోనే మేనత్త ఇంట్లో నాలుగు రోజుల కిందట రూ.52.5 లక్షలు దోచుకెళ్లాడు. ముందు ఎవరో బయటి వాళ్లే ఈ పని చేశారనుకున్నారు. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అందులో కనిపించిన ఒక కారు ఆధారంగా కూపీ లాగితే క్రాంతి కిరణే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల దుస్థితికి ఈ ఉదంతం నిదర్శనం అంటూ జగన్ సర్కారును తూర్పారబడుతున్నారు నెటిజన్లు.

This post was last modified on January 5, 2023 7:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago