వైసీపీలో అవమానాలు ఎదుర్కొంటున్న ఆనం రామ నారాయణ రెడ్డి.. టీడీపీ వైపు చూస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ సొంత ప్రభుత్వాన్నే ఇరుకునపెట్టిన ఆయన్ను వెంకటగిరి ఇన్ ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా ఆయనకు వ్యతిరేకమయ్యారు. పార్టీలో ఏకాకిగా మారిన ఆనం ..ఇప్పుడు పచ్చ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
నెల్లూరు రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆనం కుటుంబం మొదటి నుంచి వేర్వేరు పార్టీల్లో ఉంటూ వచ్చింది. కాంగ్రెస్లో, టీడీపీలో మంత్రిగా చేసిన ఆనం రామనారాయణ రెడ్డి.. 2018లో వైసీపీ కండువా కప్పుకున్నారు. తన మనసులో పడిన మాట చెప్పే అలవాటున్న ఆనం…. సొంత ప్రభుత్వంపైనే కొంతకాలంగా విమర్శలు మొదలు పెట్టారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆనం ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సాంకేతిక కారణాలా లేదా బిల్లుల చెల్లింపు జాప్యమా అనేది తెలియాల్సి ఉందన్నారు. . సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు.కార్యాలయాలు లేకపోతే సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చుని పనిచేయాలని ప్రశ్నించారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన పలు పర్యాయాలు ఆరోపించారు.ముందస్తు ఎన్నికలపైనా ఆయన నెగిటివ్ కామెంట్ చేశారు. ముందస్తు వస్తుందని అంటున్నారని అదే జరిగితే తామందరం ఓడి పోవడం ఖాయమని ఆనం విశ్లేషించారు. దీనితో వైఎస్ జగన్ కు బాగా కోపమొచ్చింది. తొలి దెబ్బగా వెంకటగిరి ఇన్ ఛార్జ్ పదవి నుంచి ఆనంను తొలగించారు. ఆ బాధ్యతలను నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అప్పగించారు. అదో తీరని అవమానమని నెల్లూరు జిల్లా రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఆనంకు టికెట్ లేనట్టేనని చెబుతున్నారు..
ముందే మాట్లాడుకున్నారా… !
ఆనం త్వరలోనే టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ వర్గాలు కూడా ఇదే వాదనను ధృవ పరుస్తున్నాయి. చంద్రబాబుతో ముందే మాట్లాడుకుని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే ఆనం డైలాగులు వదులుతున్నారని వైసీపీ అనుమానిస్తోంది. పైగా ఆనం కుటుంబంలో కొంతమంది టీడీపీలో ఉన్నారు. వారే పార్టీ అధిష్టానంతో రాయబారం చేసి ఆనంకు లైన్ క్లియర్ చేశారని అంటున్నారు. మరి ఆనం ఇప్పుడు చేరతారా.. ఎన్నికలు ప్రకటించిన తర్వాత టీడీపీలోకి వెళతారా అన్నది చూడాలి…
This post was last modified on January 4, 2023 9:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…