Political News

టీడీపీ నేత‌ల‌పై పోలీసుల లాఠీ చార్జ్‌.. ప‌దుల సంఖ్య‌లో గాయాలు!

చిత్తూరు జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే ఆయ‌న అక్క‌డ‌కు చేరుకున్నారు. అయితే.. ఈ పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచార రథం, ఇతర వాహనాలను నిలిపివేశారు. దీంతో శాంతిపురం వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది.

ఈ నేప‌థ్యంలో ఎస్.గొల్లపల్లి వద్ద టీడీపీ నేత‌లు, కార్యకర్తలపై పోలీసులు క‌నీస హెచ్చ‌రిక‌లు లేకుండానే ఉన్న‌ప‌ళంగా లాఠీఛార్జి చేశారు. పోలీసుల లాఠీఛార్జిలో పది మందికిపైగా టీడీపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయప‌డ్డారు. పలువురు మహిళా కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు. ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో విధ్వంస పాల‌న జ‌రుగుతోంద‌ని మండిప‌డ్డారు.

ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరులో చంద్ర‌బాబు ఈ రోజు ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంది. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖ‌రారు చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ సభలో పాల్గొన‌నున్నారు. దీనికి సంబంధించ పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకువ‌చ్చారు.

అయితే, ఈ స‌భ‌కు, చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు కూడా అనుమ‌తి లేద‌ని చెప్పిన పోలీసులు అన్ని మార్గాల్లో నూ పెద్ద ఎత్తున మోహరించారు. అయితే కొన్నిచోట్ల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నిలువరిస్తున్నారు.

ఇదిలావుంటే, చంద్ర‌బాబు స‌భ‌కు తాము అనుమ‌తి కోరామ‌ని, ఈ క్ర‌మంలో మంగళవారం అనుమతి ఇచ్చి బుధవారం లేదని చెప్పడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. శాంతిపురంలో వందలాది మంది పోలీసులు మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు. చంద్రబాబు పర్యటనకు జనం రాకుండా చేసేందుకు పోలీసులు భయాందోళన కలిగించేలా ప్రవర్తిస్తున్నారని నాయకులు ఆరోపించారు.

This post was last modified on January 4, 2023 5:14 pm

Share

Recent Posts

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

1 hour ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

2 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

2 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

3 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

3 hours ago