తమ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వైసీపీ సర్కారు ఒక సర్వే చేపట్టిందనే విషయం వెలుగు చూసింది. అది కూడా వార్డుల్లో ఉండే మహిళా పోలీసు కార్యదర్శులు.. ప్రజల వద్దకు వెళ్లి.. వివిధ రూపాల్లో ప్రజలను ప్రశ్నలు అడుగుతున్నారట. వీటిలో వివాహేతర సంబంధాలు ఉన్నాయా? అనే ప్రశ్న కూడా ఉండడం ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసిందని అంటున్నారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసింది.
ప్రశ్నావళిని మార్చి మళ్లీ సచివాలయాలకు పంపించారు. ఈ క్రమంలో మరో ప్రశ్న ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. అదేంటంటే.. జగన్‌ను మీరు ఫాలో అవుతున్నారా?
అంటే.. దీని ఉద్దేశం.. వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలు వింటున్నారా? వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? వైసీపీ నేతలు చేస్తున్న ప్రసంగాలను పూర్తిగా వింటున్నారా? అనే ఉద్దేశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రజలను ఇక పై జగన్ మాటలు మాత్రమే వినేలా.. ఆయన చెప్పిందే వినేలా.. ఆయన వీడియోలే చూసేలా.. ఇలా చేస్తున్నారన్నది టీడీపీ నేతల వాదన.
దీనిపై ప్రజలు మరో రూపంలో ఆలోచిస్తున్నారు. జగన్ ను ఫాలో కాకపోతే.. తమకు ఎక్కడ పథకాలు ఆగిపోతాయో.. అని వారు బెంబేలెత్తుతున్నారు. జగన్‌ను ఫాలో అవుతున్నామని చెబుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు సర్వేలు చెబుతున్నారు. ఇది రాజకీయంగా కూడా రచ్చకు దారి తీసే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ ప్రశ్నకు అనుబంధంగా మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
సీఎం జగన్‌ను మీరు ఫాలో అవుతారా? అన్నదానికి.. ఎవరైనా.. అవును.. అవుతాను! అని సమాధానం చెబితే.. వెంటనే ఏయే కార్యక్రమాలు చూస్తారు ఆయన సభలు.. సమావేశాలు, ప్రసంగాలు? అంటూ, ప్రశ్నిస్తున్నారట. వీటిలో ఏదో ఒకటి ఎంచుకుంటే.. మీకు నచ్చిన ఒక ప్రసంగం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు.. ఇప్పటి వరకు ఎన్ని ప్రసంగాలు ఫాలో అయ్యారు? ఇలా.. మైండ్ తినేస్తున్నారు. పోనీ.. కాదు.. నేన జగన్‌ను ఫాలో కాను! అని చెబితే.. ఎందుకు? మీరుఎవరిని ఫాలో అవుతారు? కారణాలు చెప్పండి అని ప్రశ్నిస్తున్నారట. మొత్తంగా ఈ విషయం ఇప్పుడు తీవ్ర రాజకీయ రచ్చకు దారితీస్తోంది. మరి మున్ముందు ఎటు దారితీస్తుందో చూడాలి.
This post was last modified on January 1, 2023 11:54 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…