కీలకమైన రాజధాని విషయంలో ఏపీ ప్రజలకు 2022 తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఒకవైపు రైతులు ఉద్యమాన్ని తీవ్ర తరం చేశారు. మలివిడత పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ సారి అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర నిర్వహించేందుకు ఉద్యుక్తులయ్యారు. అయితే.. యథాప్రకారం పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి పొందిన రైతులు.. పాదయాత్రను కొనసాగించారు. అయితే.. ఇది తూర్పు గోదావరికి చేరుకునే సరికి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పాదయాత్రకు ప్రతిగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగిపోయి.. ఉత్తరాంధ్ర గర్జన పేరిట విశాఖలో మార్చ్ నిర్వహించారు. సభ పెట్టారు. అంతేకాదు.. పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. ఆయన ఆమాట చెప్పిన మరుక్షణమే రాజమండ్రిలో పాదయాత్ర చేస్తున్న రైతులపై ఎంపీ మార్గాని భరత్ వర్గీయులు నీళ్ల సీసాలతో దాడులు చేశారు. అంతేకాదు.. ఈ ఘటనలో ఏకంగా ఎంపీనే పాల్గొన్నారు. ఇంకోవైపు. పోలీసులు పాదయాత్ర పై ఉక్కుపాదం మోపారు. దీంతో పాదయాత్రను మధ్యలో ఆపేసి.. న్యాయస్థానం మెట్టెక్కారు అన్నదాతలు.
ఇక్కడ వీరికి అనుకూలంగా తీర్పు వచ్చినా.. ఐడీ కార్డుల పేరుతో పోలీసులు మరోసారి వేధించారని రైతులు పేర్కొన్నారు. మొత్తానికి వైసీపీ నాయకుల పంతమే ఈ విషయంలో నెగ్గిందని చెప్పాలి. ఇదిలావుంటే హైకోర్టు మూడు రాజధానులు కుదరవని.. కేంద్రం చేసిన ఒక రాజధాని చట్టాన్ని మార్చేందుకు రాష్ట్రానికి హక్కులేదని.. ఆరు మాసాల్లో రైతులకు భూములను డెవలప్ చేసి ఇవ్వాలని.. మౌలిక సదుపాయాలు కల్పించాలని సంచలన తీర్పు ఇచ్చింది. అయితే.. ప్రభుత్వం ఈ తీర్పును పక్కన పెట్టి చివరి నిముషంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చకుండా.. దీనినిలోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంటూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఇదే సమయంలో మూడు రాజధానులకు కూడా సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పలేదు. ఇదిలావుంటే.. విశాఖను పాలనా రాజధాని చేయాలన్న వైసీపీ నేతల డిమాండ్లు చల్లబడగా.. రైతులు.. కేంద్రం వరకు తమ పోరును కొనసాగించారు. దాదాపు 1600 మంది రైతులు.. శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీ చేరుకుని.. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని ముందుకు తీసుకువెళ్లాలని అభ్యర్థించారు. అయితే.. కేంద్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫలితంగా.. 2022లో ఏపీ రాజధాని అంశం.. కొన్ని ఉద్రిక్తతలకు, మరికొన్ని వివాదాలకు.. మాత్రమే పరిమితమైందని చెప్పాలి.
This post was last modified on %s = human-readable time difference 11:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…