Political News

2022 జ్ఞాప‌కాలు: వైసీపీని రోడ్డున ప‌డేసిన రెండు ఘ‌ట‌న‌లు ఇవే!

కాలం వ‌డివ‌డిగా క‌దిలిపోయింది.. క్యాలెండ‌ర్ గిర్రున తిరిగిపోయింది! 2022 చ‌రిత్ర‌లో క‌లిసిపోయింది!! కానీ, జ్ఞాప‌కాల దొంత‌ర‌ల‌ను త‌ర‌చి చూస్తే.. కొన్ని అనుభూతులు.. కొన్ని అప‌వాదులు.. మ‌రికొన్ని ఆవేద‌న‌లు.. ఇంకొన్ని ఆనందాలు! వ్య‌క్తిగ‌త జీవితంలో ఎవ‌రికైనా.. ఇవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణం. ‘మ‌న‌వ‌న్నీ.. ప్రైవేటు బ‌తుకులు’ అంటారు మ‌హాక‌వి శ్రీశ్రీ!! కాబ‌ట్టి.. మ‌న విష‌యాలు ప‌క్క‌న పెట్టి మ‌న‌ల‌ను పాలించే వారి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏపీలో వైసీపీ పాల‌న‌ను ఒక్క‌సారి వెనుదిరిగి చూస్తే.. కీల‌క‌మైన రెండు విష‌యాలు ఆ పార్టీని రోడ్డున ప‌డేశాయి.

‘మంచి ఎంత ఉన్నా.. చెప్ప‌రా!’ అనే మాట స‌హ‌జ‌మే.. సాధార‌ణ‌మే. కానీ, త‌ప్పులు తెలుసుకుంటే.. వాటిని మ‌న‌నం చేసుకుంటే.. మ‌రోసారి జ‌ర‌గకుండా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక‌నే.. ‘త‌ప్పులు గుర్తించుము’ అని చిన్న‌ప్ప‌టి నుంచి మ‌న పాఠ్యాంశాల్లోనే నేర్పించారు. సో.. ఇప్పుడు ఆ విష‌యాల‌ను చ‌ర్చిస్తే.. వైసీపీ విష‌యంలో జ‌రిగిన రెండు కీల‌క‌మైన త‌ప్పులు.. పార్టీపై తీవ్ర అప‌వాదు మోపాయి. ‘ఇలా.. కూడా జ‌రుగుతుందా!?’ అని ముక్కున వేలేసుకునేలా అవి ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచాయి. అప్ప‌ట్లో ఇవి సంచ‌ల‌నం కూడా అయ్యాయి. ఒకటి దేశ స‌రిహ‌ద్దుల వ‌ర‌కు క‌నిపించి.. వినిపిస్తే.. రెండోది ద‌క్షిణాది రాష్ట్రాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అందుకే ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు అంత ప్రాధాన్యం ఏర్ప‌డింది.

1) హిందూపురం పార్ల‌మెంటు స‌భ్యుడు గోరంట్ల మాధ‌వ్‌.. న్యూడ్ వీడియో. ఎవ‌రో ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ ఆయ‌న అడ్డంగా బుక్క‌య్యారు. ఈ వీడియో ఓ రేంజ్‌లో ‘వైరల్‌’ అయింది. దీనిలో గోరంట్ల మాధవ్‌ పూర్తి నగ్నంగా కనిపించారు. అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఏకంగా భార‌త పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. నేష‌న‌ల్‌ చానళ్లలో గోరంట్ల ‘న్యూడ్ ఎపిసోడ్‌’ రోజుల త‌ర‌బ‌డి ప్ర‌సార‌మైంది. వెంట‌నే స్పందించిన వైసీపీ ప్ర‌భుత్వం ఆయ‌న త‌ప్పు ఉంటే తొల‌గిస్తామ‌ని పేర్కొంది. కానీ, ఇప్పటికీ ఈ విష‌యంలో ఏం జ‌రిగిందో ఆ ‘మాధ‌వు’డికే ఎరుక‌!!

2) విజ‌య‌మ్మ రాజీనామా.. వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా దాదాపు 11 సంవ‌త్స‌రాల పాటు పార్టీకి సేవ‌లు అందించిన సీఎం జ‌గ‌న్ మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ అనూహ్యంగా ఆ ప‌దవికి రాజీనామా స‌మ‌ర్పించ‌డం.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఏడాది జ‌రిగిన వైసీపీ ప్లీనరీ వేదికగా విజయమ్మ వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విజ‌య‌మ్మ ప్రసంగిస్తున్న స‌మ‌యంలో వేదికపై అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వెనుక నుంచి విజ‌య‌మ్మ‌ను ఎవరో పిలిచారు. దీంతో ప్రసంగం ఆపి వెనక్కి తిరిగి వారితో ఆమె మాట్లాడారు.

ఆ తర్వాత ఒక్కసారిగా సభ సైలెంట్‌ అయిపోయింది. ఆమె తన ప్రసంగం ఆపేశారు. కొద్దిసేప‌టికి విజయమ్మ‌ ప్రసంగం అందుకున్నారు. ఈ పరిణామానికి ముందువరకు ధాటిగా, అనర్గళంగా మాట్లాడిన విజయమ్మ‌ మాట.. ఆ తర్వాత త‌డ‌బ‌డింది. తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు. ముఖ కవళికలు మారిపోయాయి. మాటల్లో ఆవేదన, కంట్లో క‌న్నీరు.. వెర‌సి.. రాజీనామా ప్ర‌క‌ట‌న‌!! ‘వెనుక‌’ ఏం జ‌రిగిందో.. ఎవ‌రికీ తెలియ‌దు. కానీ, ఆమె పార్టీతో తెగ‌తెంపులు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లోనే తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. వైసీపీపై నీలినీడ‌లు ప‌రుచుకునేలా చేసింది.

This post was last modified on December 31, 2022 11:29 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

14 hours ago