ఏపీ సీఎం జగన్.. చంద్రబాబుపైనా.. పనిలోపనిగా పవన్‌పైనా నిప్పులు చెరిగేశారు. చంద్రబాబు స్క్రిప్టు రాస్తే.. పవన్ యాక్టింగ్ చేస్తాడు.. అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రాజకీయం అంటే.. ఏంటో కూడా జగనే చెప్పేశారు. రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపించామని జగన్ అన్నారు. సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ ప్రజల సేవకులని చెప్పారు. రాజకీయం అంటే ఇదేనని స్పష్టం చేశారు.
రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపామన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలేదని జగన్ ఆరోపించారు. ఫొటో షూట్ కోసం, జనాన్ని ఎక్కువ చూపడానికి ఒక చిన్న సందులోకి నెట్టి.. 8 మందిని చంపేశారని చెప్పారు. రాజకీయం అంటే షూటింగ్ కాదని.. ఎస్సీ, ఎస్టీ మధ్య తరగతి జీవితాల్లో మార్పు తీసుకుని రావడమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏది చెప్తే.. పవన్ కల్యాణ్ అది చేస్తాడని విమర్శించారు. చంద్రబాబును చూస్తే కేవలం రెండే విషయాలు గుర్తుకువస్తాయన్న జగన్.. అవి వెన్నుపోటు, మోసాలు అని వ్యాఖ్యానించారు.
“చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక్క మంచి పని కూడా చేయలేదు. దత్తతండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు మరో దత్తపుత్రుడు. వీరి ఇద్దరి స్టైల్ ఒక్కటే. ఈ రాష్ట్రం కాకపోతే.. మరో రాష్ట్రం, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అన్నట్లు ఉంటుంది. వీరిద్దరి స్వరూపం చూస్తే.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, ఇదేం ఖర్మ మన రాజకీయానికి అని అనిపిస్తోంది“ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. మరో ఆయనకేమో(పవన్) ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు(ఉన్న ఎమ్మెల్యేను జగనే లాగేసుకున్నాడు). రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు. పవన్కి చంద్రబాబు నిర్మాత, దర్శకుడు. చంద్రబాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు కాల్షీట్లు ఇస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తే ఈయన డైలాగ్లు చెప్పి యాక్ట్ చేస్తాడు అని అక్కసు వెళ్లగక్కారు.
This post was last modified on December 31, 2022 9:03 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…