తెలుగుదేశం పార్టీలో అనధికార సభ్యుడిగా కొనసాగుతున్న కొలికిపూడి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా సోషల్ మీడియా బ్యాచ్ కోడై కూస్తోంది. అందులోనూ టీడీపీ పట్టున్న, ప్రతిష్టాత్మకమైన నందిగామ సీటును కేటాయిస్తారని చెబుతున్నారు. దీనిపై పార్టీ వర్గాలు మాత్రం పెదవి విప్పడం లేదు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన కొలికిపూడి.. ఇప్పుడు ఐఎఎస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ…. రైతుల గొంతుకగా ఉన్న కొలికిపూడి.. టీవీ డిబెట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏబీఎన్ లో చర్చ సందర్భంగా లైవ్ లోనే బీజేపీ నేత విష్ణు వర్షన్ రెడ్డిని చెప్పుతో కొట్టి ఫేమస్ అయ్యారు. తర్వాతే కొలికిపూడిని టీడీపీ ఓన్ చేసుకుంది. ఆయనకు పార్టీ ఫండ్ కూడా వస్తుందని చెబుతున్నారు.
నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పక్కనపెట్టి మరీ కొలికిపూడికి టికెట్ ఇస్తారని ప్రచారం ఊపందుకుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు కొలికిపూడి తగిన ప్రత్యర్థి అని చంద్రబాబు నమ్ముతున్నారట. అందుకే సౌమ్యను వేరే విధంగా అకామడేట్ చేసి… కొలికిపూడికి నందిగామ కేటాయించేందుకు ఆయన అంగీకరించారని సోషల్ మీడియాలో టాక్
కొలికిపూడికి దూసుకు పోయే తత్వముందని, జగన్ తప్పిదాలను ఆయన కరెక్టుగా ఎండ గట్టగలరని టీడీపీ నమ్ముతోంది. పైగా అమరావతి ఉద్యమాన్ని సమర్థించే వారంతా కొలికిపూడికి ఓటేస్తారని కూడా చెబుతున్నారు. కొలికిపూడి మాటకారి. ప్రతీ మాటలోనూ విశ్లేషణ ఉంటుంది. టీవీ డిబెట్ల ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే నందిగామ సీటుకు ఆయన పేరు వినిపిస్తోంది. మరి అసలు విషయం పార్టీ అధినేత మాత్రమే చెప్పగలరు…
This post was last modified on December 29, 2022 10:10 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…