పెళ్లి కాని ప్రసాదు.. అంటూ బీజేపీలోని ఓ వింగ్ తరచుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. కుటుంబాల్లో ఉండేవారి సమస్యలు ఆయనకు ఏం తెలుస్తాయని అనే వారు కూడా ఉన్నారు. దీనికి కారణం 50 ఏళ్ల వయసు వచ్చేసినా.. రాహుల్ పెట్టిచేసుకోకపోవడమే. అంతేకాదు.. అసలు ఆ ఊసు కూడా ఆయన ఎత్తరు.
అయితే, చిత్రంగా ఇప్పుడు ఆయన పెళ్లి మాట ఎత్తారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర చేస్తున్న ఆయనకు ఇటీవల ఒక చిత్రమైన అనుభవం ఎందురైంది. కేరళలో 40 ఏళ్ల వయసున్న అవివాహిత ఒకావిడ.. ప్రపోజ్ చేసింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. దీనికి రాహుల్ నవ్వి ఊరుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆ ఘటన ప్రభావమో.. లేక.. మరేమో తెలియదు కానీ.. రాహుల్ నోట పెళ్లి ప్రస్తావన వచ్చింది.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది రాహుల్ చెప్పలేదు కానీ, తాను చేసుకోబోయే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో మాత్రం చెప్పారు. తన తల్లి సోనియా, నానమ్మ ఇందిరాగాంధీ గుణాలు, లక్షణాలు కలగలిసిన మహిళ జీవిత భాగస్వామిగా వస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. మాజీ ప్రధాని, తన నానమ్మ ఇందిరా గాంధీ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని, మరో తల్లి లాంటిందని రాహుల్ చెప్పారు. ఈ లక్షణాలతో పాటు తన తల్లి లక్షణాలు కూడా కలగలిసిన అమ్మాయి దొరికితే మూడు ముళ్లు వేస్తానని చెప్పారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు సంబంధాలు వెతుకుతారేమో చూడాలని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on December 29, 2022 10:32 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…