Political News

సార్ వెళ్లినా వార్తే.. వెళ్ల‌కున్నా వార్తే.. ద‌టీజ్ కేసీఆర్‌!!

తెలంగాణ సీఎం KCR ఏం చేసినా.. సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న చుట్టూ అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. కేంద్రంతో విభేదిస్తున్న కేసీఆర్‌.. కేంద్రం నుంచి ఎవ‌రు రాష్ట్రానికి వ‌చ్చినా.. వారిని క‌లుసుకునేందుకు.. ప్రొటోకాల్ ప్ర‌కారం.. వారిని ఆహ్వానించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఆ స‌మ‌యానికి ఆయ‌న ఏ జ్వ‌ర‌మో.. త‌ల‌నొప్పితోనో బాధ‌ప‌డుతున్నారంటూ.. సీఎంవో కార్యాల‌యం ప్ర‌క‌ట‌న ఇస్తోంది.

గ‌తంలో ప్ర‌ధాని Modi రెండు సార్లు తెలంగాణ వ‌చ్చినా..కేసీఆర్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌లేదు. ఒక‌సారి ప్రైవేటు కార్య‌క్ర‌మం అన్నారు. రెండోసారి.. ప్ర‌ధాని రాక‌కు ముందుగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్లిపోయారు. ఇలా.. కేంద్రం నుంచి ఎవ‌రు కీల‌క నాయ‌కులు వ‌చ్చినా.. ఆయ‌న ఆహ్వానం ప‌ల‌క‌క‌పోవ‌డం.. అప్ప‌ట్లో సంచ‌ల‌న వార్త‌లుగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

శీతాకాల విడిదిలో భాగంగా 5 రోజుల పాటు ఆమె బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ఉండ‌నున్నారు. అయితే.. రాష్ట్ర‌ప‌తి Draupadi Murmuకు మాత్రం సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. శాలువాక‌ప్పి.. పుష్ప‌గుచ్ఛం అందించి మ‌రీ.. కేసీఆర్ స్వాగ‌తం ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. అయితే.. నిజానికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ముర్ముకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పింది కేసీఆరే! అప్ప‌ట్లో య‌శ్వంత్ సిన్హాను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌ల‌ప‌ర‌చాలంటూ.. ఆయ‌న అనేక మందిని కోరారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ముర్ము రాష్ట్రానికి రావ‌డం.. కేసీఆర్ స్వాగ‌తం ప‌లుకుతారా? లేదా(ప్రొటోకాల్ ప్ర‌కారం)అనేది కూడా ఆస‌క్తిగా మారింది. అయితే.. చివ‌ర‌కు ఈ ఊహాగానాల‌కు తెరదించుతూ.. కేసీఆర్ ఆమెకు స్వాగ‌తం ప‌లికారు. అయితే.. రాజ్‌భవన్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై రాష్ట్ర‌ప‌తికి విందు ఇస్తున్నారు. దీనికి మాత్రం కేసీఆర్ హాజ‌ర‌య్యేది లేద‌ని Telangana భ‌వ‌న్ వ‌ర్గాలు చెప్పాయి. మొత్తానికి కేసీఆర్‌వెళ్లినా.. వెళ్ల‌క‌పోయినా..కూడా వార్త కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 27, 2022 6:21 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

1 hour ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

4 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

4 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

5 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

6 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

7 hours ago