గుడివాడ మళ్లీ రగులుకుంది. రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడలో గెడ్డం గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. టీడీపీ కీలకనాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు లక్ష్యంగా పెట్రోల్ సంచులతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను నిలవరించలేక బాధితులైన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి దిగారు. మీడియా ప్రతినిధులపైనా గెడ్డం గ్యాంగ్ సభ్యులు దాడికి తెగపడి సెల్ఫోన్లు, కెమెరాలు పగలకొట్టారు. సుమారు రెండు గంటలపాటు గుడివాడ పట్టణం అట్టుడికిపోయింది.
అసలేం జరిగిందంటే..
ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు గెడ్డం గ్యాంగ్ నేత, మాజీ మంత్రి కౌడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాలు కాళీ పోన్ చేసి అసభ్యపదజాలంతో దూషిస్తూ. ‘నిన్ను చంపేస్తా’ అని బెదిరింపులకు దిగాడు. దీంతో రావి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వెనువెంటనే కాళీ తన అనుచరులతో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోలు సంచులను విసిరేప్రయత్నం చేశాడు.
అయితే, అవి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాయి. మరోవైపు, రావి ఇచ్చిన సమాచారంతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. వైసీపీ శ్రేణులను నిలువరించాల్సింది పోయి ప్రేక్షకపాత్ర పోషించారు. అయితే, గెడ్డం గ్యాంగ్ విరిసిన పెట్రోల్ సంచులను అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పై కాళీ చేయిచేసుకున్నాడు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వైసీపీ శ్రేణులను నిలువరించకపోగా, బాధితులైన టీడీపీ శ్రేణులపై లాఠీచార్జి చేశారు.
సోమవారం మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, దీనిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకుండా పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే గెడ్డం గ్యాం గ్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
This post was last modified on December 26, 2022 9:44 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…