వచ్చే 2024 ఎన్నికల్లో అనేక మార్పులు ఉంటాయని.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు స్పష్టం చేస్తున్నాయి. తమ తమ నేతలను ఇప్పటి నుంచి మానసికంగా రెడీ చేస్తున్నాయి. అయితే.. అన్నీ కాకపోయినా.. కనీసం 20 నుంచి 30 స్థానాల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి కారణం.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకంగా మారిపోవడమే!
దీంతో టీడీపీలోను, వైసీపీలోనూ.. యుద్ధ మేఘాలు ఆవరించినట్టుగా ఉంది పరిస్థితి. అయితే.. ఈ మార్పును ఎక్కువ మంది నాయకులు సానుకూలంగా తీసుకోవడం లేదు. పార్టీ అధినేతల అభిప్రాయం ప్రకారం.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులు.. ప్రత్యర్థి పార్టీ బలమైన నాయకుడిని నిలబెట్టిన స్థానాల్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించేశారు. ఉదాహరణకు.. విజయవాడ పార్లమెంటు స్థానంలో టీడీపీ లగడపాటి రాజగోపాల్‌కు టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీంతో అంతకన్నా బలమైన నాయకుడి కోసం వైసీపీ వెతుకుతోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పీవీపీని పక్కన పెట్టారు. కానీ, పీవీపీ మాత్రం తనకే ఇవ్వాలని.. ఈసారి ఎలాగైనా గెలుస్తానని.. 100 నుంచి 200 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధమని చెబుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినా సరే.. నీకు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అదేవిధంగా ఈ సారి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
దీంతో ఇక్కడ మేకపాటి కుటుంబాన్ని పక్కన పెట్టి.. అంతకన్నా బలమైన వ్యక్తిని పెట్టే ఆలోచన చేస్తున్నారట. ఇక టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా మార్పులు జరుగుతున్నాయి. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనను గన్నవరం పంపించి.. వల్లభనేని వంశీకి యాంటీగా నిలబెట్టాలని చూస్తున్నారు.కానీ, గద్దె మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ విధంగా ఇలాంటి మార్పులు ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను తెరమీదకి వస్తున్నాయి. కానీ, నాయకులు మాత్రం ఇష్టపడడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 25, 2022 10:33 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…