మెగా ఫ్యాన్స్.. వచ్చే ఎన్నికల్లో కీలక రోల్ పోషించేందుకు రెడీ అయినట్టుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. విజయవాడలోనూ వారు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీని ఓన్ చేసుకుని.. వచ్చే ఎన్నికల్లో పనిచేయాలని అనుకున్నారు. ఈ పరిణామం.. రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం రేపింది. మరోవైపు.. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ కూడా బాబాయి పిలుపు ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తామన్నారు.
ఈ రెండు పరిణామాలు కూడా.. రాష్ట్రంలో జనసేన దూకుడును పెంచుతాయని అందరూ అంచనా వేసుకున్నారు. అయితే.. ఇప్పటికి ఈ సమావేశం జరిగిన ఆరు మాసాలు అయిపోయింది. ఈ మధ్యలోనే పవన్ అనేక సభల్లో ప్రసంగించారు. జూన్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ నుంచి ఇటీవల విజయనగరం సభ వరకు అనేక చోట్ల ప్రసంగించారు. అయితే.. ఈ క్రమంలో ఎక్కడా మెగా ఫ్యాన్స్ సందడి, సంబరం కనిపించలేదు.
అలాగని.. వీరు పక్కకు తప్పుకుంటారని కూడా చెప్పలేం. అయితే.. ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఉంటున్నారు.. అనేది ప్రశ్న. సో.. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు వరకు వెయిట్ చేస్తారా? అప్పటి వరకు పట్టించుకోరా? అనేది కూడా సందేహమే. రాష్ట్రంలో జోరు చూస్తే.. వైసీపీ, టీడీపీలు పుంజుకుంటున్నాయి. మరోవైపు.. సభలు నిర్వహిస్తూ.. పార్టీని బలోపేతం చేసేందుకు కూడా అడుగులు వేస్తున్నాయి.
కానీ, మెగా ఫ్యాన్స్ సందడి మాత్రం ఎక్కడా కనిపించకపోవడం.. ఎప్పుడో ఎన్నికలకు ముందు వచ్చినా.. ప్రయోజనం ఉంటుందా? అప్పటికే ప్రజల మైండ్ సెట్ మారిపోయి ఉంటుంది కదా.. అప్పుడు వీళ్లు చెప్పినట్టు నడుస్తుందా? అనేది కూడా సందేహమే. సో.. ఎలా చూసుకున్నా.. మెగా ఫ్యాన్స్ సందడి అయినా.. పవన్ సందడి అయినా.. ఇలా కనిపించి.. అలా మాయమవుతున్నట్టుగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 25, 2022 10:25 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…