ఔను! ఏపీలో ఒక్క దెబ్బ.. వైసీపీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. లక్షల ఓట్లను ఆ పార్టీకి దూరం చేసే పరి స్థితి వచ్చేసింది. ఎన్నికలకుముందు వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయంతోగ్రామాలు అట్టుడుకుతున్నా యి. లక్షల సంఖ్యలో ఓట్లు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఓట్లను ఒడిసి పట్టుకునేదెవరు? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే..ఎవరికివారు.. దీనిపైకామెంట్లు చేయడం లేదు.
ఇంతకీ ఏం జరిగిందంటే!
రాష్ట్రంలో ఇటీవలే సామాజిక పింఛన్‌ను రూ.250 చొప్పున పెంచి.. జనవరి 1 నుంచి 2750 రూపాయలు ఇస్తామని.. సీఎం జగన్‌ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారింది. దీంతో వెంటనే విద్యుత్ యూనిట్లు 300 దాటిన వారికి, 1000 చదరపు గజాల స్థలం లేదా.. ఇల్లు ఉన్నవారికి.. ఆదాయపన్ను కట్టేవారు ఉన్న కుటుంబాలకు ఈ పింఛన్లను తొలగించేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందిపై ఈ ప్రభావం పడుతోంది.
నిజానికి ప్రభుత్వం ఎన్నోపథకాలు ఇస్తోందని.. నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అనర్హులను ఎత్తేస్తున్నామని అంటున్నారు. కానీ, ఇది చాలా సున్నితమైనవ్యవహారం. ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా.. ఇవ్వకున్నా.. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు.. నెలనెలా ఇచ్చే పింఛన్‌వారికి ప్రాణం. ఇంకా చెప్పాలంటే.. దీనికి వారు.. అలవాటు పడ్డారు. ఒక్క నెల ఆగినా.. వారికి చేతులు ఆడే పరిస్థితి లేదు.
దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చసాగుతోంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే వీరంతా రోడ్డెక్కారు. రచ్చచేశారు. మునిసిపల్ కౌన్సిల్ లోనూ.. వైసీపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక్క లబ్ధి దారుని తొలగించినా.. 4 ఓట్లు పోతాయని.. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఓట్ల కు ఎసరు తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దీనిని అందిపుచ్చుకునే పార్టీ కనిపించకపోవడం గమనార్హం. మరి ఈ ఓటర్లను ఎవరు మచ్చిక చేసుకుంటారో చూడాలి.
This post was last modified on December 25, 2022 1:52 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…