ఇప్పటి వరకు ఏపీ అప్పుల విషయంలో నిమిషానికో మాట చెబుతూ వచ్చిన ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. తాజాగా తాను అప్పులు ఎక్కువ చేస్తున్న మాట వాస్తవమేనని ఒప్పుకుంది. ఔను..చంద్రబాబు హయాంలో కన్నా.. ఇప్పుడు మేం ఎక్కువగా నే అప్పులు చేస్తున్నాం అని సాక్షాత్తూ సీఎం జగన్ చెప్పేశారు. అయితే.. ఆయన ఈ అప్పులు చేయడాన్ని సమర్థించుకున్నారు.
ఇప్పటిలా అప్పట్లో సంక్షేమ పథకాలు లేవని.. అందుకే ఇప్పుడు అప్పులు పెరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం సొంత నియోజక వర్గం పులివెందులలో.. ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పులివెందులలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. చెడిపోయిన వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
తాము చేసే ప్రతి పనిలో నెగెటివ్ కోణాలే చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నినాదం.. ‘వై నాట్ 175’ అని సీఎం జగన్ తెలిపారు. పులివెందుల ప్రజలు ఇచ్చిన భరోసాతోనే ముందుకెళ్తున్నామ న్నారు. “అందరూ ఆలోచించాలి. అప్పుడూ ఒకటే రాష్ట్రం ఒకటే బడ్జెట్.. మరి ఇప్పుడూ అదే రాష్ట్రం అదే బడ్జెట్. అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటిలా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. మనకు ఓటు వేయలేని వాళ్లకీ అర్హత ఉన్నవారికి కూడా మంచి జరిగేలా చూస్తున్నాం అని జగన్ చెప్పారు.
సీఎం మారడం వల్లే రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల తలరాతలు మారుతున్నాయని పేర్కొన్నారు. తమ పాలనలో ఎక్కడా లంచాలు లేవని తెలిపారు. పులివెందులలో రూ.125 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు.
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…