Political News

గృహసారథుల నియామకం హుళక్కేనా ?

ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. సకాలంలో వేతనాలు అందని ప్రభుత్వోద్యోగులు మాట వినేందుకు నిరాకరిస్తున్నారు. విపక్షం రోజురోజుకు బలపడుతోంది. చంద్రబాబుకు జనం నీరాజనం పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం సీఎం జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కింది స్థాయి నుంచి ప్రతీ ఇంటిని ప్రతీ ఒక్కరినీ డేగకంటితో కనిపెడితే ఓట్లు రాబట్టడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చి ఆ దిశగా అడుగులు వేశారు. ప్రతీ ఒక్క ఓటు కీలకమేనన్న అభిప్రాయం వెల్లడైన తరుణంలో గృహ సారథుల నియామకం టీమ్ జగన్ మదిలో మెదిలింది…

2024 ఎన్నికల్లో విజయం కోసం జగన్ ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే లక్ష్యంగా ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందాయో లేదో తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిన మానస పుత్రికే గృహ సారథులని చెప్పాలి. నిజానికి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు వాలంటీర్ల వ్యవస్థను అమలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల 60 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. అయితే వాలంటీర్లు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఈసీ ఆదేశించింది. దానితో జగన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. ఇప్పుడు కొత్త స్కెచ్ తో గృహ వాలంటీర్ల వ్యవస్థను తెరపైకి తెచ్చారు

వై నాట్ 175.. అంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు గెలవకూడదన్న కాన్సెప్ట్ తో గృహ సారథుల నియామకాన్ని తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ తరపున 5.20 లక్షల మంది గృహసారథులను నియమించాలని ఆదేశించారు రాష్ట్రంలోని 15 వేల గ్రామాల్లో గృహసారథులు ఉంటారు. ప్రతీ సచివాలయ పరిథిలో ముగ్గురు కన్వీనర్లు, ప్రతీ యాభై ఇళ్లకు ఇద్దరు గృహ సారథులను నియమించాలని జగన్ ఆదేశించారు. ఈ నియమాలకే ఇప్పుడు పార్టీలో గొడవలకు కారణమవుతోంది.

కన్వీనర్ల నియామకంలో విభేదాలు తలెత్తాయి. ప్రతీ చోట ఎమ్మెల్యే వర్గం సూచించిన ఒక కన్వీనర్, ప్రత్యర్థి వర్గం సూచించిన మరో కన్వీనర్ నియామకానికి పేర్లు రెడీ అయ్యాయి. మూడో కన్వీనర్ నియామకం ఎవరి ద్వారా జరగాలన్న చర్చతో ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని చెబుతున్నారు. ఇక గృహ సారథిగా ఉండేందుకు చాలా చోట్ల జనం రావడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్లు అన్ని పనులు చూసుకుంటున్నారని, ఇంక తాము చేయగలిగిందేముందని ప్రశ్నిస్తున్నారట.

ఓటర్లకు డబ్బులు పంచేందుకు గృహ సారథులను వినియోగిస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఓటుకు పది నుంచి పదిహేను వేలు ముట్టజెపుతారని కూడా చెప్పుకున్నారు. దానితో ఎన్నికల్లో డబ్బులు మిగిల్చుకోవచ్చని కొందరు నిరుద్యోగులు గృహ సారథుల పనికి ఒప్పుకున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత వారంతా వెనక్కి తగ్గారు. పార్టీ నుంచి వచ్చే నిధులను ఎమ్మెల్యేల మనుషులు, ఇంచార్జ్ లు సర్పంచులు నొక్కేసి తమ చేతికి చాలా తక్కువ ఇస్తారని. అటు ఓటర్లు డబ్బులు అందలేదని నిలదీసే అవకాశం ఉందని గ్రహించి గృహసారథులుగా ఉండేందుకు జనం ముందుకు రావడం లేదు. మరి నియామకానికి జగన్ పెట్టిన గడువు క్రిస్మస్ తో ముగుస్తోంది.. ఏం చేయాలో..

This post was last modified on December 24, 2022 6:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

2 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

2 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

3 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

4 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

4 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

6 hours ago