Political News

ఆ ఇద్దరు నేతలు టీడీపీలోకి వస్తారా.. ?

రాజకీయాలంటే విమర్శలు. విపక్షంలో ఉంటే ప్రభుత్వ పథకాలు, విధానాలు, నిర్ణయాలను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం. అధికారంలో ఉంటే విపక్షాలకు ఓ విధానం లేదని, ఐనదానికి, కానిదానికి తమను టార్గెట్ చేయాలను చూస్తున్నాయని చెప్పుకోవడం.. ఇదీ సాధారణంగా జరిగేదే. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖమ్మం టూర్లో మాత్రం తెలంగాణ అధికార పార్టీని పేరు పెట్టి విమర్శించినట్లుగా అనిపించలేదు. రెండు రాష్ట్రాలు మళ్లీ కలవాలంటున్నారని వైసీపీని విమర్శించారే తప్ప…. కేసీఆర్ విధానాలను ఒక్క సారి కూడా తూర్పార పట్టలేదు. టీడీపీ హయాంలో ఉమ్మడి రాష్ట్ర అభివృద్దిని మాత్రమే ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన ప్రతీ ప్రాజెక్టును గుర్తు చేశారు. మళ్లీ టీడీపీ వస్తే తెలంగాణకు పూర్వ వైభవం వస్తుందని హామీ ఇచ్చారు..

తిరిగి పార్టీలోకి రావాలని పిలుపు

తెలంగాణ అభివృద్ధికి మళ్లీ టీడీపీ అవసరమని చంద్రబాబు చెప్పుకున్నారు. తెలంగాణలో టీడీపీని వీడి వెళ్లిన నాయకులంతా తిరిగి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరం కలిసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దామని ఆయన అన్నారు. అభివృద్ధిలో , సంక్షేమంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని అన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందీ తెలంగాణలోనేనని ఆయన మరోసారి గుర్తు చేస్తారు…

తుమ్మల టీడీపీలోకి వస్తారా.. !

ఖమ్మం నుంచే విజయ శంఖారావం పూరించడానికి చాలా కారణాలున్నాయి. ఖమ్మం ఉమ్మడి కృష్ణా జిల్లాను ఆనుకుని ఉంటుంది. అక్కడ సెటిలర్లు ఎక్కువ. తెలంగాణ కంటే ఏపీ ప్రభావమే ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఇక ఖమ్మం జిల్లాలో కీలక నేత అయిన తుమ్మల నాగేశ్వరరావు .. తిరిగీ టిడీపీలోకి వస్తారా అన్న చర్చ మొదలైంది. ఆయన ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి టీఆర్ఎస్ లో చేరిన ఆయన తెలంగాణ మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో ఓడిపోవడంతో తుమ్మలకు చిక్కులు వచ్చి పడ్డాయి. ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు పెరిగాయి. మొత్తం నాలుగు గ్రూపులు ఉన్నాయని చెబుతారు. తుమ్మలను అణిచివేసేందుకు మిగతా గ్రూపులు గట్టిగా పనిచేస్తున్నాయి. కేసీఆర్ కూడా తనను పట్టించుకోవడం లేదని తుమ్మల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరతారని కొంత కాలం క్రితం ప్రచారం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ టీడీపీ క్రియాశీలమైన నేపథ్యంలో తుమ్మల పునరాలోచనలో పడ్డారన్న చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాతో పాటు సామాజిక వర్గాల లెక్కలు వేసుకుని ఆయన మళ్లీ పచ్చ కండువా కప్పుకున్నా ఆశ్చర్యం లేదని అేంటున్నారు…

నిజామాబాద్ సంగతేంటి ?

నేల తల్లి పురుడు పోసుకున్నట్లుగా ఖమ్మం సభకు జనం పోటెత్తడంతో టీ.టీడీపీలో జోష్ పెరిగింది. తదుపరి సభ నిజామాబాద్ లో ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఆంధ్రా వాసనలు ఎక్కువే. ఎక్కడ చూసినా సెటిలర్లు కనిపిస్తారు. నిజామాబాద్ కు చెందిన కీలక నాయకుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మండవను.. సీఎం కేసీఆర్ స్వయంగా పిలిపించుకుని తమ పార్టీలో చేర్చుకున్నారు. తర్వాతి ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు. మండవ కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు టీడీపీ నేతలు స్వయంగా మండవను ఆహ్వానించి కీలక పదవి ఇస్తారో లేదో చూడాలి…

This post was last modified on December 24, 2022 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

3 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

4 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

6 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

8 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

8 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

8 hours ago