Political News

2019 వ‌ర‌కు ఎక్క‌డున్నారు జ‌గ‌న‌న్నా?

రాజ‌కీయాల్లో నాయ‌కులు ఏం చెప్పినా.. ఏం మాట్లాడినా.. చెల్లుతుంద‌నే రోజులకు కాలం చెల్లింది. ఎందుకంటే.. ప్ర‌జ‌ల‌కు అన్ని లెక్క‌లు ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. ప్ర‌జ‌లు ఇంకా కొన్ని జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోలేదు. గురివింద నీతులు చెబితే.. ఎవ‌రూ ఊరుకోరు కూడా. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. క‌డ‌ప జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. తాను ఏపీ వాడిన‌నే ముద్ర వేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఖ‌మ్మంలో ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌భ‌.. ఆయ‌న డైలాగుల‌కు జ‌గ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు.

చంద్ర‌బాబుకు ఈ రాష్ట్రం కాక‌పోతే మ‌రో రాష్ట్రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌కు మాత్రం ఏపీనే ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తోనే అనుబంధం ఉంద‌ని, ఇక్క‌డి గాలే పీలుస్తున్నాన‌ని.. ఇక్క‌డే ఇల్లు కూడా క‌ట్టుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. త‌ను ఇక్క‌డే రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని అన్నారు. స‌రే.. జ‌గ‌న్ ఎందుకు చెప్పారంటే.. చంద్ర‌బాబుపై ‘నాన్ లోక‌ల్ ‘ ముద్ర వేసేందుకేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇక్క‌డ జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై నెటిజ‌న్లు.. ముఖ్యంగా ఏపీకి చెందిన మేధావులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల‌కుముందు వ‌ర‌కు త‌మ‌రు(జ‌గ‌న్) ఎక్క‌డున్నారు జ‌గ‌న్ స‌ర్‌? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. 2014లో 67 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్న త‌ర్వాత‌.. కూడా జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అంతెందుకు.. అసెంబ్లీకి వ‌చ్చి వెళ్లేందుకు కూడా ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వం నుంచి తీసుకున్నారు. ఆదివారాల్లో సెల‌వు రోజుల్లో కూడా ఆయ‌న ఏపీలో ఉండ‌కుండా.. అసెంబ్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయ‌ని అంటున్నారు. దీనికి అయిన ఖ‌ర్చును ఏపీ ప్ర‌జ‌లే చెల్లించార‌ని.. గుర్తు చేస్తున్నారు.

ఇవ‌న్నీ మ‌రిచిపోయి.. ఇప్పుడు ఈ మూడు ఏళ్ల కాలానికి.. త‌న‌కు త‌నే స‌ర్టిఫికెట్ ఇచ్చుకోవ‌డం ఏం బాలేద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే జగ‌న్‌ లోట‌స్ పాండ్ బంగ‌ళా, ఆయ‌న వ్యాపార స‌ముదాయం.. సాక్షి ప‌త్రిక హెడ్ క్వార్ట‌ర్ వంటివి ఏపీలో ఉన్నాయా? హైద‌రాబాద్‌లో ఉన్నాయా? అనేది కూడా నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌. ఒక‌వేలు ఇత‌రుల‌పై చూపిస్తే.. నాలుగు వేళ్లు నీవైపు చూపిస్తున్నాయ‌ని జ‌గ‌న‌న్నా.. అంటున్నారు.

This post was last modified on December 23, 2022 9:54 pm

Share
Show comments

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

4 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

8 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago