సినీ దిగ్గజంగా ఒక వెలుగు వెలిగిన కైకాల సత్యనారాయణ మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. సీనీరంగంలో సుదీర్ఘ కాలం అంటే.. దాదాపు 60 ఏళ్లకు పైగానే బంధం ఏర్పరుచుకున్న కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోనూ అజాతశతృవుగా వ్యవహరించారు. రాజకీయాల్లో ఉన్నది చాలా స్వల్ప కాలమే అయినా.. ఆయన నిబద్ధతను చాటుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టీడీపీ తరఫున అనేక సందర్భాల్లో కైకాల ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించిన సత్యనారాయణ.. సినీ రంగంలోకి ప్రవేశిం చాక.. ఇదే జిల్లాకు చెందిన ఎన్టీఆర్‌తో అనుబంధం ఏర్పడింది. ఇదే..రాజకీయాల వైపు కూడా కైకాలను నడిపించింది. ఈ క్రమంలో నే 1996లో టీడీపీ తరఫున ఆయన మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు.
అప్పట్లో కాంగ్రెస్-టీడీపీలు మాత్రమే బలమైన ప్రత్యర్థులు. కాంగ్రెస్ తరఫున కొలుసు పెదరెడ్డయ్య యాద వ్ పోటీ చేశారు. కైకాల వర్సెస్ యాదవ్‌ల మధ్య హోరా హోరీ పోరు సాగింది. అయినా.. ఇక్కడి ప్రజలు కైకాల వైపే మొగ్గు చూపారు. 81,507 ఓట్ల మెజారిటీతో కైకాల విజయం దక్కించుకున్నారు. పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన రూపాయి కూడా ఎన్నికల ఖర్చు తీసుకోకుండా.. తన సొంత సొమ్మును వినియోగించారని .. అప్పట్లో పార్టీలో చర్చ సాగింది.
అయితే అనూహ్యంగా అప్పటి వాజపేయి ప్రభుత్వం కూలిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక.. అప్పటికే టీడీపీలో మారిన పరిణామాలు.. సినీ రంగంలో అవకాశాల నేపథ్యంలో కైకాల.. రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉన్న రెండేళ్ల పాటైనా.. ఆయన మచిలీపట్నంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నరసాపురం-హైదరాబాద్ మధ్య నడిచే నరసాపురం ఎక్స్‌ప్రెస్ ఆక్యుపెన్సీ పెంచేలా బోగీలు ఏర్పాటు చేయించారు.
This post was last modified on December 23, 2022 12:40 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…