ఏ నాయకుడికైనా.. సొంత జిల్లా.. సొంత ప్రాంతం అంటే.. సొంత ఇల్లు లెక్క. ఎలాంటి భద్రతా అవసరం లేదు. ఇటీవల గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ అక్కడ పర్యటించారు. అయితే.. ఆయన వ్యక్తిగత భద్రత ను పక్కన పెట్టి.. ఇది సొంత రాష్ట్రం ఇక్కడనాకు ఎలాంటి భయం లేదన్నారు.
అంటే.. సొంత రాష్ట్రంపై ఆయనకు అంత నమ్మకం. కానీ,ఏపీలో సీఎం జగన్‌కు తన సొంత జిల్లాపైనే నమ్మకం లేనట్టు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ శుక్రవారం నుంచి మూడు రోజులు పాటు తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. అంటే.. ఒకరకంగా ఆయన తన పుట్టింటికి వచ్చినట్టే కదా! పైగా.. గత ఎన్నికల్లో రెండు ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలను కూడా సీఎం జగన్ గెలుచుకున్నారు. అంటే.. ప్రత్యర్థి అన్న మాటే లేదు. అయినా.. కూడా ఇక్కడ 3 వేల మందితో సీఎం జగన్ భద్రత కల్పించుకున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
కడప జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసులు కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులను బందోబస్తుకు రప్పించారు. సుమారు 3000 మంది పోలీసులతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులందరికీ ఎస్పీ అన్బురాజన్ విధులను కేటాయించారు.
అంతేకాదు.. బాంబు స్క్వాడ్, పోలీస్ జాగిలాలు, మెటల్ డిటెక్టివ్ తదితర వాటితో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరి ఇదేం చోద్యమో.. అని నెటిజన్లు బుగ్గలు నొక్కుకుంటున్నారు.
This post was last modified on December 23, 2022 6:57 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…