చైనాలో విజృంభిస్తున్న కరోనా.. కొత్త వేరియెంట్ల ఫలితంగా.. భారత్‌లోనూ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తాజాగా దేశంలో మళ్లీ మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది లాంటే.. కరోనా నిబంధనల పేరుతో.. కాంగ్రెస్‌పైనా.. కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కొవిడ్ నిబంధనలు పాటించే పరిస్థితి లేకుంటే భారత్ జోడో యాత్రను నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం కాంగ్రెస్‌కు సూచించింది.
ఈ మేరకు రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఇటీవల యాత్రలో పాల్గొని వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్..కరోనా బారిన పడినట్లు మంత్రి ప్రస్తావించారు. సో.. ఇప్పుడున్న పరిస్థితిలో తప్పనిసరిగా కరోనా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. లేకపోతే.. యాత్రను నిలుపుదల చేయాలని కోరింది.
అయితే.. తాజా లేఖపై కాంగ్రెస్ స్పందించింది. “దయచేసి కొవిడ్ ప్రోటోకాల్‌లను ప్రకటించండి. మేము వాటిని అనుసరిస్తాం. అయితే రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ యాత్రలు చేస్తోంది.. మరి వారికి కూడా లేఖలు పంపారా?” అని కాంగ్రెస్ ఎదురు దాడి చేయడం గమనార్హం. భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణా నుహ్లో ప్రవేశించిన రాహుల్ గాంధీ, బీజేపీ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ద్వేషపూరితమైన మార్కెట్లో ప్రేమ అనే షాప్ను భారత జోడో యాత్ర ద్వారా ప్రారంభిస్తాను. మీలాంటి వాళ్లు దేశంలో ద్వేషాన్ని నింపేందుకు ప్రయత్నిస్తే, మాలాంటి వాళ్లు ప్రేమను పంచేందుకు వెళ్తారు“ అని రాహుల్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు జోరుగా వైరల్ అవుతున్నాయి.
This post was last modified on December 22, 2022 6:37 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…