ఏపీ సీఎం జగన్ ఆలోచనలను తమపై రుద్దవద్దంటూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఘాటు రిప్లయ్ ఇచ్చింది. జగన్ పేరు ఎత్తకుండానే దుమ్ముదులిపేసింది. “ఏపీ సీఎం ఆలోచనలు ఆయనకు ఉంటాయి. అవి మేం పుణికి పుచ్చుకున్నామని ఎవరు చెప్పారు? అలా అనుకుంటే..దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నా రు. వారు చేస్తున్నవన్నీ కేంద్రం చేస్తుందా? మీ ఆలోచన తప్పు” అని కేంద్రం వైసీపీ ఎంపీలకు తగిన విధంగా సమాధానం చెప్పింది.
ఇంతకీ ఏం జరిగింది?
ఏపీలో అమలుచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గురించి.. పార్లమెంట్లో తాజాగా చర్చ జరిగింది.. దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థను అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఏమైనా ఉందానని వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీంతో దిగ్గున తన సీటులోంచి లేచిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, ఫైర్ బ్రాండ్ నిరంజన్ జ్యోతి ఘాటు సమాధనం ఇచ్చారు. ఇది లిఖిత పూర్వకమే అయినా.. చదివి వినిపించారు.
“గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలుచేసే ప్రతిపాదనేమీ మా వద్ద లేదు. ఇది ఏపీ సీఎంకు వచ్చిన ఆలోచన. దీనిని అక్కడే కొనసాగించుకోండి. మాపై రుద్దొద్దు” అని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమీక్షలో.. ప్రభుత్వ సేవలు అందించడానికి ప్రతి 2వేల మందికి ఒకటి చొప్పున ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గురించి.. సీఆర్ఎం నివేదికలో పేర్కొన్న విషయం నిజమేనని ఆమె తెలిపారు.
అయితే.. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేసే ఉద్దేశం ఉందా అని… వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరిలు పార్లమెంటులో ప్రశ్నించారు. దీంతో ఆమె ప్రస్తుతానికి ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రతిపాదనేదీ లేదని చెప్పడంతో పాటు ఒకింత ఘాటుగా.. రిప్లయ్ ఇచ్చారు. దీంతో ఎంపీలు సైలెంట్ అయ్యారు. అయితే.. ఎందుకు అమలు చేయడం లేదనే విషయంపై మాత్రం ఆమె రియాక్ట్ కాలేదు.
This post was last modified on December 21, 2022 3:39 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…