ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు నిజంగానే షాకిస్తున్నాయి. ఏ ఉద్దేశంతో వీటిని తీసుకుం టున్నారో.. ప్రబుత్వానికి అయినా తెలుసో లేదో.. కానీ, వీటి వల్ల వివాదాలే ఎక్కువగా తెరమీదికి వస్తున్నాయి. కొన్నాళ్ల కిందట.. కన్యాశుల్కం నాటక ప్రదర్శనపైనే నిషేధం విధించారు. అదేమంటే వైశ్యుల మనోభావా లు దెబ్బతినేలా ఉన్నాయంటూ.. వారి డిమాండ్‌మేరకు ఈ నిషేధం విధించినట్టు ప్రభుత్వం తెలిపింది.
వాస్తవానికి బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రాసిన కన్యాశుల్కంలో సామాజిక నీతి సూత్రం ఉందని.. అనేక మంది మేధావులు చెప్పారు. అయినా.. సర్కారు వినిపించుకుంటే కదా! సరే.. ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో ఉంది. కన్యాశుల్కం నాటకాన్ని పూర్తిగా ఇంగ్లీషులో అనువదించి ఇవ్వాలని.. దానిని చదివి తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు ఆదేశించింది. దీంతో పిటిషనర్లు ఇప్పుడు ఆ పనిమీదే ఉన్నారు.
ఇదిలావుంటే, తాజాగా ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు కానక అనుకునేలా .. ఒక పదంపై నిషేధం విధించింది. అదే.. “భట్రాజు పొగడ్తలు” అనేది ఇకపై ఎవరూ మాట్లాడకూడదని.. స్పష్టం చేస్తూ..బుధవారం తెల్లవారు జామున జీవోఇష్యూ చేసింది. సినిమాలు, టీవీల సీరియళ్లు, రాజకీయ నేతల ప్రసంగాలు, బహిరంగ సభలు.. వ్యక్తిగత దూషణల సమయంలో కూడా ఈ పదాన్ని వినియోగించరాదని స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఉత్తర్వులు కాదని ఎవరైనా.. ఈ పదం వినియోగిస్తే.. ఇండియన్ పీనల్‌కోడ్ 1860 ప్రకారం.. చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి మరో వివరణ ఏమి ఇచ్చిందం టే.. బీసీ సంఘాల ప్రతినిధుల డిమాండ్ మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఇదీ.. సంగతి..!!
This post was last modified on December 21, 2022 1:32 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…