ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారు. వీరికి తిరుగులేదని.. వారి అనుచరులు, పార్టీ అధిష్టానం కూడా నమ్ముతోంది. అయితే, ఎంతైనా ప్రజాస్వామ్యం కదా.. ప్రజాభీష్టం లేకుంటే.. పవన్ లాంటి వాడే ఓడిపోయిన పరిస్థితి ని చూశాం కదా! ఇప్పుడు వీరి పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఫైర్ బ్రాండ్లలో మరింత ఫైర్ అయ్యేవారి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..
మంత్రి రోజా: నగరి నియోజకవర్గం నుంచి ప్రాధాన్యం వహిస్తున్నారు. రెండు సార్లుగా వరుస విజయాలు అందుకుంటున్నారు. మాజీ మంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమ ను ఓడించారనే రికార్డు సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు భాను ప్రకాష్‌ను కూడా ఓడించారు. కానీ, ఇప్పుడు సొంత నేతలే ఆమెపై కత్తి కట్టారు. ప్రత్యర్థి ఎవరో కూడా తెలియనంతగా ఇప్పుడు ఆమెకు వ్యతిరేకత పెరిగిపోయింది. దీంతో సొంత పార్టీ నేతలే తన పుట్టి ముంచడం ఖాయమని రోజా తలపోస్తున్నారు.
మాజీ మంత్రి కురసాల: కురసాల కన్నబాబు.. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాపు నాయకుడు.. ఫైర్ బ్రాండ్. ఈయన పరిస్థితి కూడా ఇంతే. రెడ్డి వర్గంతో ఆయనకు ఏర్పడిన విభేదాలు.. నియోజకవర్గంలో ఆయనను ఓడిస్తామని.. రెడ్డి వర్గం బెదిరించే వరకు వచ్చేసింది. కాపులు కూడా ఇప్పుడు పవన్ జపం చేస్తున్నారు. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామని కాకినాడ కాపు సంఘం.. ఇటీవల వనభోజనాల సమయంలో తీర్మానం చేసింది.
మంత్రి అంబటి: జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు.. సత్తెన పల్లి నుంచి సుదీర్ఘ కాలం తర్వాత.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. టీడీపీ కీలక నేత దివంగత కోడెల శివప్రసాద్‌పై విజయం దక్కించుకున్నానన్న ఆనందం.. ఆయనలో కనిపించడం లేదు. ఎందుకంటే.. సొంత పార్టీలోనే వేరు కుంపట్లు.. అంబటికి వ్యతిరేకంగా రాజకీయాలు ఆయనను కలవర పెడుతున్నారు. అధిష్టానం కూడా.. ఈసారి అక్కడ కాదులే అనే సంకేతాలు పంపేసింది.
మాజీ మంత్రి కొడాలినాని: గుడివాడ నుంచి వరుస విజయాలు తప్ప.. పరాజయం ఎరుగని.. నానికి..ఇప్పుడు సైలెంట్ యాంటి ఓటు బ్యాంకు పెరుగుతోంది. మంత్రిగా కూడా తమకు న్యాయం చేయలేక పోయారని.. ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి మాత్రం ఆహా ఓహో అంటున్నా.. క్యాసినో వ్యవహారం తర్వాత.. మాజీ మంత్రి గ్రాఫ్ అమాంతం ఢమాల్ మందట. ఇలా..చాలా మంది ఫైర్ బ్రాండ్ల పరిస్థితి ఇలానే ఉందని పార్టీలోనే ఓవర్గం చెబుతుండడం గమనార్హం.
This post was last modified on December 20, 2022 1:25 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…