జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కామెంట్లలో కొంత తడబాటు ఉందేమోకానీ.. ఆయన వ్యూహంలో మా త్రం లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు చీలనివ్వనని పవన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. దీనిని కొన్ని కొన్ని సార్లు దాట వేస్తున్నారు. ఒంటరి యుద్ధమేనని కొన్ని సార్లు చెబుతున్నారు. సో.. ఇలా.. ఆయన చేస్తున్న డైలాగుల్లో కొంత తేడా అయితే.. ఉంది.
కానీ, వ్యూహానికి మాత్రం తేడా లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం తప్ప పవన్ ముందున్న లక్ష్యం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ప్రత్యేక హోదా ను లడ్డూతోను.. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతోనూ పోల్చి.. కొంత రాజకీయం చేసిన విషయం తెలిసిందే. తర్వాత.. చంద్రబాబు పై విమర్శలను దారి తప్పించేందుకు తానే హోదా ఉద్యమాన్ని భుజాన వేసుకుంటానని అన్నారు.
కానీ, తర్వాత ఏపీ ప్రజల్లో పోరాడే సత్తాలేదని.. వారు కారం తినడం లేదని అనేసి దానిని మరిచిపోయారు. ఇక, ఇప్పుడు కూడా అంతే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని.. కొంత సేపు, అధికారంలోకి రావడం.. రాకపోవడం.. సీఎం కావడం .. కాకపోవడం.. తన చేతుల్లో లేదని తాజాగాను చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని పవన్ చెబుతున్నారు.
అయితే.. ఇది జరగాలంటే.. బలమైన టీడీపీతో కలిసి ముందుకు సాగాలి. ఓకే.. ఇప్పటికే వైసీపీ చెప్పినట్టు 30-40 స్థానాలకు ఈ రెండు పార్టీల మధ్య బేరం జరుగుతోంది. ఇదే నిజమైతే.. వచ్చే ఎన్నికల్లో సీఎం పోస్టు ను చంద్రబాబు వదులుకుంటారా? అనేది ప్రశ్న. సో.. పవన్‌కు సీఎం ఛాన్స్ దక్కేది లేదు. కాకపోతే.. గెలిచే 10-20 మందిలో ఓ రెండు మంత్రి పదవులు మాత్రం దక్కే అవకాశం ఉంటుంది. అంటే ఇతమిత్థంగా.. పవన్ మాటల్లో తడబాటు ఉన్నా.. వ్యూహం మాత్రం స్పష్టంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 19, 2022 3:13 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…