Political News

సోము వీర్రాజు.. పిచ్చ కామెడీ

భారతీయ జనతా పార్టీ ఎనిమిదేళ్లుగా దేశాన్ని పాలిస్తోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. తమకు బలం లేని చోట కూడా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలను కొని అధికారాన్ని కైవసం చేసుకోవడం చూస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ బలహీన పడుతుండడం చూస్తే భవిష్యత్తు భాజపాదే అనిపిస్తోంది. మరో పర్యాయం కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంటే ఆశ్చర్యం లేదు. 

మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ పరిస్థితి దయనీయం. గతంలో ఒకటో రెండో సీట్లయినా వస్తుండేవి కానీ.. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. వార్డు మెంబర్ కూడా గెలిచిన చరిత్ర లేని సోము వీర్రాజు ఆ పార్టీని నడిపిస్తుంటే ఆయన చుట్టూ కూడా అలాంటి ప్రజాబలం లేని నేతలే కనిపిస్తున్నారు. ఇక సోము వీర్రాజు మాటలు, చేష్టలు ఎప్పటికప్పుడు ఎంత కామెడీ అవుతుంటాయో తెలిసిందే.

తాజాగా ఆయనకు రాష్ట్రంలోని సమస్యలేవీ కనిపించనట్లుంది. ఏకంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ మీద ఆయన యుద్ధం ప్రకటించేశారు. తమ దేశంపై ఉగ్రవాద ఆరోపణలు చేసినందుకు ప్రతిగా.. మోడీ గుజరాత్‌లో మారణకాండను సృష్టించారంటూ భారత ప్రధానిని విమర్శించాడు బిలావల్. ఇందుకు సోము వీర్రాజు శివాలెత్తిపోయి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఒక 20 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని మోడీపై బిలావల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 

ఈ సందర్భంగా బిలావల్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కానీ నెటిజన్లకు ఇదో కామెడీ కార్యక్రమంలా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అరాచకాలపై, జగన్ సర్కారుపై విమర్శలు చేసే దమ్ము, సమయం లేదు కానీ.. అంతర్జాతీయ సమస్యల మీద సోము వీర్రాజు పోరాడతారా.. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక టౌన్లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మీద తెలుగులో విమర్శలు చేస్తే.. నిరసన కార్యక్రమాలు చేపడితే ఏం ప్రయోజనం.. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏం లాభం అంటూ ఆయన మీద కౌంటర్లేస్తున్నారు నెటిజన్లు.

This post was last modified on December 19, 2022 8:02 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

1 hour ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago