ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వారాహి ప్రచార వాహనంలో త్వరలోనే తాను ప్రజల మధ్యకు రానున్నట్టుపవన్ తెలిపారు. ఈ క్రమంలో తనను ఎవరు ఆపుతారో చూస్తానని సవాల్ రువ్వారు. నా వారాహి వాహనంతో ప్రచారానికి వస్తున్నా. నన్ను ఎవడు ఆపుతాడో రండి. మీ సీఎంను రమ్మనండి. కూసే గాడిదలను రమ్మనండి. నా వారాహిని ఆపమనండి. అప్పుడు చూపిస్తా నేనేంటో!! అని పవన్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో కౌలు రైతులను పవన్ పరామర్శించారు. ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆయన సాయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని, ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు.
మంత్రి అంబటి రాంబాబుది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని పవన్ నిప్పులు చెరిగారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఒక మంత్రా? అని ప్రశ్నించారు. తనపై బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నాయకులకు సరైన సమాధానం చెబుతానన్నారు. తాను ఏ పార్టీకి కొమ్ముకాయనని, ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు పట్టలేదన్నారు. తన సినిమాలు ఆపేసినా భయం లేదన్నారు. వారాహి వాహనంలో ఏపీ రోడ్లపై తిరుగుతా.. ఎవరూ ఆపుతారో చూస్తానని సవాల్ విసిరారు.
This post was last modified on December 18, 2022 5:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…