వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అనేక వ్యయ ప్రయాసలు పడుతున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఉన్న అన్ని అవకాశాలను కూడా వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు వ్యూహాలను అమలు చేస్తోంది. ఒకటి సంక్షేమం. సమాజంలోని లబ్ధి దారులకు అందరికీ.. సంక్షేమాన్ని అందిస్తున్నామని.. ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందుతోందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ క్రమంలో లబ్దిదారులను తమవైపు తిప్పుకొనేందుకు గడపగడపకు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అయితే.. ఇక్కడ చిక్కేంటంటే.. సంక్షేమం తీసుకున్నవారు మాత్రమే సర్కారుకు అనుకూలంగా ఉండ డం. ఇది కూడా కష్టమే. ఎన్నికల సమయానికి గాలి ఎటు వీస్తే.. అటే అన్నట్టుగా వ్యవహరిస్తే మరింత ఇబ్బంది. అందుకే.. మరో వ్యూహానికి రెడీ అయింది.. మూడు ప్రాంతాల అభివృద్ధి మూడు రాజధానులతోనే నని ప్రచారం చేస్తోంది.
ఇది ఎక్కువగా సక్సెస్ అవుతుందని వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారు కూడా.. మూడు ప్రాంతాల అభివృద్ధిని అయితే.. కాదనరు కదా! ఇదే వైసీపీకి అనుకూలించే అంశమని అంటున్నారు. ఒకవేళ ఇది కూడా వర్కవుట్ కాదని అనుకుంటే.. బీసీ కార్డును ఉపయోగించా లనే వ్యూహంతో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. వచ్చే ఎన్నికల నాటికి.. వ్యూహాలు ఎటు నుంచి ఎటైనా మారే అవకాశం ఉంటుంది. ప్రజల మూడ్.. అప్పటికి ఎన్నికల సరళి.. ఇతర పార్టీల వ్యూహాలు.. వీటన్నింటినీ బేరీజు వేసుకుని.. బీసీ కార్డును బయటకు తీసే యోచనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. అవసరం అనుకుంటే.. జనరల్ స్థానాలను సైతం 20 శాతం బీసీలకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేయనున్నట్టు సమాచారం. జనరల్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోయినా.. పార్టీలోను.. నామినేటెడ్‌లోనూ కీలక పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
This post was last modified on December 19, 2022 2:47 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…