Political News

అటు -ఇటు ఒకే పాట‌.. ఐఏఎస్‌ల‌కు పండ‌గే!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌లంగా వినిపిస్తున్న మాట‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిల భార‌త స‌ర్వీసు అధికారు లు భారీ సంఖ్య‌లో పోటీకి దిగుతార‌ని!! ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇది ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్ని కొన్ని విష‌యాల్లో అధికార పార్టీలు వేస్తున్న అడుగులకు కొంద‌రు అధికారులు ఫ‌క్తు.. రాజ‌కీయ నాయ‌కుల్లాగా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అధికార పార్టీ నేత‌లకంటే ముందే వారు స్పందిస్తున్నారు.

ఇది ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణ‌లోనూ క‌నిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ అధినేత‌ల‌కు స‌లాంలు కొడుతూ.. గులాం గిరీ చేస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది. ఇటీవ‌ల తెలంగాణ‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు సీఎం కేసీఆర్‌కు ప‌దే ప‌దే పాద‌ న‌మ‌స్కారాలు చేశారు. ఇటు ఏపీలో చూసుకుంటే.. సీఎం జ‌గ‌న్ కు ఇలా పాద‌న‌మ‌స్కారాలు చేయాల‌ని ఉన్నా..ఆయ‌నే వ‌ద్ద‌ని అంటున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

మీరు ఒక్క న‌మ‌స్కారం చేస్తారు. గిట్ట‌ని మీడియా వంద సార్లు ప్ర‌సారం చేస్తుంది. వ‌ద్దులే అని కొన్నాళ్ల కింద‌టే ఆయ‌న కుండబ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తేల్చి చెప్పార‌ట‌. దీంతో అధికారులు న‌మ‌స్కారాల మాట ఎలా ఉన్నా.. సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌త్య‌క్షంలోనూ.. ప‌రోక్షంలోనూ కొనియాడుతున్న ప‌రిస్థితి ఉంది. ఇలాంటివారిలో ఐఏఎస్ మాత్ర‌మే కాదు.. కీల‌క‌మైన ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

జిల్లాల క‌లెక్ట‌ర్ల నుంచి.. స‌చివాల‌యంలో ప‌నిచేసే ఉన్న‌త‌స్థాయి అధికారుల వ‌ర‌కు కూడా వ‌చ్చే ఎన్నిక ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. వీరిలో కొంద‌రు ఉద్యోగ సంఘాల నాయ‌కులు కూడా ఉన్నార‌ని ప్ర‌చారం జరుగుతోంది. సో.. ఇలా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌జాక్షేత్రంలోకి వ‌చ్చే ఐఏఎస్‌, ఐపీఎస్‌లు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఎంత మందికి అవ‌కాశం ఇస్తారో.. ఎవ‌రెవ‌రు.. పుంజుకుంటారో చూడాలి.

This post was last modified on December 19, 2022 8:02 am

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

4 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

21 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

43 minutes ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

1 hour ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

5 hours ago