ఏపీ అధికార పార్టీ వైసీపీలో అందరూ పాతవారికే టికెట్లు ఇస్తాం. అందరూ కష్టపడి పనిచేయండి.. పార్టీని గెలిపించండి. మీరు పట్టుదలగా గెలవండి! అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తరచుగా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిచి మరీ క్లాసులు ఇస్తున్నారు. ఓకే.. అంటూ.. నేతలు కూడా తలలూపుతున్నారు. తీరా చూస్తే.. అంతర్గత చర్చల్లో మరో కోణం కనిపిస్తోంది.
ప్రస్తుతం వైసీపీకి జగన్ మినహా.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జగన్ స్వయంగా చేసిన ప్రకటన మేరకు 32 మందిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా మంది వైసీపీ నేతలకు చుక్కెదురు అవుతుందని అంటున్నారు. కాకినాడ సిటీ, రూరల్, కొవ్వూరు, ఆచంట.. ఇలా అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ పట్టుబట్టినా గట్టెక్కడం కష్టమేనని చెబుతున్నారు.
ఇలా.. చూసుకుంటే.. మరో ఐదారు టికెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే.. ఇప్పుడు ఉన్న 150 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 40 మందిని మార్చడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక, దీంతో పాటు.. గత ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గాలు 23. వీటిలోనూ నాయకులను ఎంచాల్సిన అవసరం ఉంది. ఒక్కట టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిని మినహా.. మిగిలిన చోట్ల ఖచ్చితంగా కొత్తవారికి అవకాశం కల్పించాలి.
అంటే.. ఇతమిత్థంగా.. వైసీపీ అధినేత జగన్..ఎంత గీసిగీసి కొత్తవారిని తీసుకుందామని అనుకున్నా.. కనీసంలో కనీసం 50 సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వీరంతా కొత్త ముఖాలే అవుతారని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికిప్పుడు వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని వైసీపీ అధినేత చెబుతున్నా.. కొందరు మాత్రం ప్రయత్నాలు మానడం లేదు. దీంతో ఇలాంటి వారికి 5 సీట్ల వరకు అవకాశం ఉన్నా.. మిగిలిన సీట్లు మాత్రం కొత్తవారికే ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 18, 2022 10:42 am
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…