ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మూడు రాజధానులకు ఈ నెల 17వ తేదీతో మూడేళ్లు పూర్త య్యాయి. అసెంబ్లీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలోనే మూడు రాజధానులు సాకారం అవుతా యని చెప్పారు. అయితే.. ఇవి ఎక్కడిగొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయాయి. సరే.. ఇవి అలా ఉండడానికి న్యాయపరమైన సమస్యలు మాత్రమే కారణం కాదు.. రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు ఎలానూ.. మూడు రాజధానులపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అమరావతి ఏకైక రాజధాని అనే విషయం న్యాయపరిధిలో ఉంది. దీంతో మూడు రాజధానులు ప్రకటించినా.. ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన అయితే ప్రధానంగా వినిపిస్తోంది. అయితే.. దీనివెనుక.. రాజకీయంగా వైసీపీకి మరో వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి.. సంక్షేమం పనిచేయకపోతే.. వెంటనే ఈ కత్తిని ప్రయోగించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
అంటే.. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనే అజెండాను వైసీపీ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. కర్నూలులో ఇప్పటికే హైకోర్టును కాంక్షిస్తూ.. పెద్ద ఎత్తున వైసీపీ సభలు నిర్వహించింది. ఇక, విశాఖలో రాజధాని కోసం అక్కడ కూడా మంత్రులు గడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణలు సభ పెట్టారు. వీటిపై ఇతమిత్థంగా పార్టీ తరఫున ప్రకటన లేదు.
అయినా.. వీటిని లైవ్‌లో ఉంచి.. సంక్షేమం కుదరకపోతే.. మూడు రాజధానుల అస్త్రాన్ని ప్రయోగించే వ్యూహంతో వైసీపీ ఉందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. అయితే.ఇప్పటి వరకు చూసుకుంటే.. మూడు రాజధానులను ప్రకటించినా.. పార్టికీ అనుకున్న విధంగా మైలేజీ అయితే దక్కలేదు. సో.. ఈ క్రమంలోనే పార్టీ వ్యూహాలు మారతాయని.. వచ్చే ఎన్నికల నాటికిఎలాగైనా ముందుకు సాగడం ఖాయమని మరికొందరు చెబుతున్నారు.
This post was last modified on December 17, 2022 2:22 pm
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…