వారేం అల్లాటప్పా బ్యాచ్ కాదు. అత్యున్నత విద్యార్హతలతో పాటు.. కీలక స్థానాల్లో ఉండేవారు. లక్షలాది మంది సమయం కన్నా వారి టైం విలువ చాలా ఎక్కువ. రోటీన్.. రొడ్డుకొట్టుడు రాజకీయాల్ని వారు అస్సలు పట్టించుకోరు. విషయం లేని వాటివైపు వారి చూపు పడదు. అలాంటి వారు డెబ్భై ప్లస్ లో ఉండి.. నిద్ర లేస్తే రాజకీయ ప్రత్యర్థుల చేత విపరీతంగా తిట్టించుకునే చంద్రబాబు ప్రసంగానికి క్యూ కట్టటమా? నీ పనైపోయింది బాబు.. బైబై బాబు లాంటి మాటలే కాదు.. సభ్యతతో వ్యవహరించే వారు మాట్లాడటానికి ఇష్టపడని భాషలో చంద్రబాబును సోషల్ మీడియాలో ఏసుకునే బ్యాచ్ కు.. వారి నోటి నుంచే మాటలకు.. వారు వెలిబుచ్చే అభిప్రాయాలకు భిన్నమైన సీన్ ఒకటి ఆవిష్క్రతమైంది. హైదరాబాద్ ఐఎస్ బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ఏర్పాటు చేసి ఇరవైఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ముగింపుగా టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.
ఐఎస్ బీ లాంటి సంస్థల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సంస్థకు చెందిన వారే ఉంటారు. వారెవరూ పెయిడ్ ఆర్టిస్టులు కాదు. ఆ మాటకు వస్తే.. నచ్చని పని చేయటానికి ససేమిరా అంటారే కానీ మొహమాటం కోసం గంటల తరబడి తమ సమయాన్ని వేస్టు చేయటానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారున్న ప్రాంగణంలో చంద్రబాబు ప్రసంగం వినేందుకు ప్రదర్శించిన తపన.. ఆయన ప్రోగ్రాంకు హాజరయ్యేందుకు ప్రదర్శించిన హడావుడిని కొట్టొచ్చినట్లుగా కనిపించింది.
ఇక.. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు.. ఆయన విజన్ కు అభిమానులు ఏస్థాయిలో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబును అతిధిగా పిలిచి ఆహ్వానించిన కార్యక్రమానికి పోటెత్తటమే కాదు.. ఆడిటోరియం ఫుల్ కావటంతో చాలామందిని లోపలకు అనుమతించలేదు. దీంతో ఎంతో మంది తీవ్రమైన నిరాశకు గురయ్యారు. మరింత మంది హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోటి వెంట వినిపించింది. బాబుకు ఉన్న క్రేజ్ ఎంతన్న విషయాన్ని తాజా ప్రోగ్రాం స్పష్టం చేసిందని చెప్పాలి.
ఇవేమీ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ కనిపించే అంశాలు కావు. ఆ కార్యక్రమానికి స్వయంగా వెళ్లి కవర్ చేసినప్పుడు కంటికి కనిపించిన వాస్తవాల్ని చెప్పే వేదిక ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చే అంశాలు. శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు వచ్చిన సందర్భంగా ఐఎస్ బీలో చోటు చేసుకున్న హడావుడి చూసినప్పుడు.. చంద్రబాబుకు ఉన్న క్రేజ్ ఇంతనా? అన్న ఆశ్చర్యం కలుగక మానదు.
తన అనుభవాల్ని వివరించటంతో పాటు.. హైదరాబాద్ మహానగరాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే విషయంలో తాను పడిన కష్టాన్ని ఆయన వివరించినప్పుడు.. ఐఎస్ బీ ఏర్పాటులో తాను పోషించిన కీలక పాత్ర గురించి చెప్పుకున్నారు. కొంతమందికి చంద్రబాబు మాటలు గొప్పలకు పోయినట్లుగా అనిపించొచ్చు. కష్టపడినప్పుడు.. శ్రమ చేసినప్పుడు వాటి గురించి నలుగురికి చెప్పుకోవటం ఎందుకు తప్పు అవుతుంది? ఏమైనా.. చంద్రబాబుకున్న ఎలైట్ వర్గాల్లో ఉన్న క్రేజ్ ఎంతన్న విషయాన్ని తాజా ఐఎస్ బీ కార్యక్రమం స్పష్టం చేసిందని చెప్పాలి.
This post was last modified on December 17, 2022 11:53 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…