Political News

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. సీబీఐ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంపై లోతుగా విచార‌ణ జ‌రిపిన సీబీఐ.. తాజాగా సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేసింది. దీనిలో అనేక సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను కోర్టు సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని చెబుతున్న తెలంగాణ సీఎం కుమార్తె క‌విత‌, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్ర‌ల‌ను సీబీఐ పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న కీల‌క విష‌యాలు ..

  • లిక్క‌ర్ కుంభ‌కోణంలో ముడుపులు నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించారు.
  • అభిషేక్ బోయిన్‌పల్లి 20 నుంచి 30 కోట్ల రూపా యల నగదును హవాలా మార్గంలో త‌ర‌లించారు.
  • ఈ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో.. రూ.30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు అందజేశారు.
  • దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహారం న‌డిపాడు.
  • శరత్ చంద్రారెడ్డి, క‌ల్వ‌కుంట్ల కవిత, మాగుంట శ్రీనువాసులు రెడ్డి సౌత్ గ్రూప్‌ను కంట్రోల్ చేశారు.
  • మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏ ఇద్దరి మధ్య ఎక్కడా గుత్తాధిపత్యం కానీ సమూహాలకు కానీ లబ్ధిచేకూర్చకూడదనే విధానాన్ని రూపకల్పన చేశారు.
  • మద్యం పాలసీ రూపకూల్పన జరుగుతున్న సమయంలోనే నిందితులు కుట్రకు పాల్పడ్డారు.
  • హోల్‌సేల్ వ్యాపారులు 12 శాతం లాభాలు ఆర్జించేలా, దీనిలో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారు.
  • హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4,756 కోట్లు అందాయని.. అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా సీబీఐ తెలిపింది.
  • గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయింది.
  • ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. పేర్కొంది.
  • కొందరు ప్రజా ప్ర‌తినిధులు, ఇతర సంస్థలతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు.
    +మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా సేక‌రించిన‌ట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది.

This post was last modified on December 16, 2022 6:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

1 hour ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

4 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

5 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

5 hours ago